-

తెలంగాణ ప్రజల్లో సంతోషం

21 Nov, 2018 18:26 IST|Sakshi
గంగుల కమలాకర్‌కు గజమాల వేసి సన్మానిస్తున్న నాయీబ్రాహ్మణులు 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి     గంగుల కమలాకర్‌

సాక్షి, కరీంనగర్‌అర్బన్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం ఓ ఫంక్షన్‌లో పట్టణ నాయీబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సభలో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. డిప్యూటీ మేయర్‌ గుగ్గిల్లపు రమేశ్, కార్పోరేటర్లు బండారి వేణు, సంఘం నాయకులు గడ్డం మోహన్, నీలం మొండయ్య, పగడాల జయరాం, రాజేశ్, కంది వెంకటేష్, జంపాల సంపత్, లక్ష్మినారాయణ, కుమార్, గుంజపడుగు రాజు పాల్గొన్నారు.

మహాకూటమి కుట్రలను తిప్పికొట్టాలి

సాక్షి,కరీంనగర్‌రూరల్‌: తెలంగాణను దోచుకునేందుకు వస్తున్న మహాకూటమి కుట్రలను తిప్పికొట్టేందుకు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్, మందులపల్లి గ్రామాల్లో మంగళవారం ఇంటింటా తిరుగుతూ ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మరోసారి టీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వృద్ధురాలైన పూరెల్ల ఎల్లమ్మ వృద్ధాప్య పింఛన్‌ నెల డబ్బులు రూ.1000 ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం కమలాకర్‌కు అందించి ఎమ్మెల్యేగా గెలవాలని ఆశీర్వదించింది.  మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణగౌడ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ జె.రాజేశ్వర్‌రావు, ఎంపీటీసీ రాంచంద్రారెడ్డి, భద్రయ్య, ఆర్టీఏ సభ్యుడు పెద్ది రమేశ్, దుర్శేడ్‌ సింగిల్‌విండో చైర్మన్‌ మంద రాజమల్లు, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కె.శ్రీనివాస్, మాజీ ప్రజాప్రతినిధులు పి.శ్యాంసుందర్‌రెడ్డి, జె.సాగర్, ఎస్‌.సంపత్‌రావు, దాది సుధాకర్, సాయిలు, పెద్దన్న, ఆనందరావులతోపాటు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు