తెలంగాణ ప్రజలు మోదీకి మద్దతివ్వాలి

3 Feb, 2019 04:29 IST|Sakshi

బీజేపీ నేత కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌ రైతులు, ఇతర వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకున్నం దున వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలవాలని బీజేపీనేత కిషన్‌రెడ్డి కోరారు. కేంద్ర బడ్జెట్‌లో వివిధ పథకాల కింద తీసు కున్న చర్యలతో రాష్ట్రంలోని 90% రైతులకు ప్రయో జనం చేకూరుతుందన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ నాయకులు చింతా సాంబమూర్తి, డా.ప్రకాశ్‌రెడ్డి, సుధాకరశర్మలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివిధ పంటలకు కనీస మద్దతు ధరతో పాటు, పావు, అర ఎకరం ఉన్న రైతులకు కూడా రూ.6 వేలు వస్తాయని చెప్పారు.

కేసీఆర్‌ కిట్‌లో, కిలో బియ్యం సబ్సిడీ, తదితర పథకాల్లో కేంద్ర వాటా గణనీయంగా ఉంటోందన్నారు. అయితే ఈ విషయంలో పలు రాష్ట్రాలు కనీసం కేంద్రప్రభుత్వ ప్రస్తావన కూడా చేయడం లేదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు టీఆర్‌ఎస్, కేసీఆర్‌ల చుట్టూ తిరిగాయని, లోక్‌సభ ఎన్నికలు మోదీ, బీజేపీ, భారత్‌ల చుట్టూ తిరుగుతాయన్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందన్నారు. కొన్ని పార్టీలు ఈ బడ్జెట్‌ను తక్కువ చేసి చూపిస్తున్నాయన్నారు.

ఆ రాష్ట్రాలు కలసిరావట్లేదు
ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్నిరాష్ట్రాలతో కలసి అమలు చేద్దామంటే తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ కలసి రావడంలేదని కిషన్‌రెడ్డి అన్నారు. తెలం గాణలో పంటల బీమా పథకం సరిగా అమలు చేయడం లేదని అందుకే వివిధ పథకాల కింద కేంద్రమే లబ్ధిదారులకే నేరుగా ఇవ్వాలని నిర్ణయిం చిందని వివరించారు. తెలంగాణకు సంబంధించి ఐఐటీకి నిధులు, పంజగుట్టలో ట్రామా సెంటర్‌ ఏర్పాటు, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగింపు, 11 నీటిపారుదల ప్రాజెక్టులకు, చర్లపల్లి రైల్వేషెడ్‌కు నిధులు వంటివి బడ్జెట్‌లో కేటాయించా రన్నారు. కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీకి వ్యవసాయ మంటేనే తెలియదని, పాలు గేదె నుండి వస్తాయా లేక దున్నపోతు నుండి వస్తాయా అన్నది కూడా తెలియదని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు