అధ్యయనం తర్వాతే ఎయిర్‌ పోర్టు !

22 Aug, 2019 10:07 IST|Sakshi
జక్రాన్‌పల్లిలోఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలిస్తున్న ఏఏఐ ప్రతినిధులు

సాక్షి, జక్రాన్‌పల్లి (నిజామాబాద్‌): జక్రాన్‌పల్లి మండలంలో ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. ఇక్కడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదన ఉంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కన్సల్టెన్సీ డీజీఎం అమిత్‌ కుమార్‌తో పాటు ఏజీఎంలు నీరవ్‌ గుప్తా, కుమార్‌ వైభవ్‌లు స్థల పరిశీలనకు వచ్చారు. ల్యాండ్‌ ఓరియంటేషన్, విండ్‌ డైరెక్షన్, ల్యాండ్‌ ఫిజిబులిటీ వివరాలు సేకరించారు. వీటన్నింటిని అధ్యయనం చేసిన అనంతరం డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిన డీపీఆర్‌ ప్రకారం ఎయిర్‌పోర్టుకు ఈ స్థలం అనుకూలమా.. కాదా అనేది తేలుతుంది. కాగా ఎయిర్‌ పోర్టు ప్రతినిధుల బృందం సభ్యులు జక్రాన్‌పల్లి, మనోహరాబాద్, తొర్లికొండ, కొలిప్యాక్, అర్గుల్‌ గ్రామాల పరిధిలో గల 850 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం డీజీఎం అమిత్‌ మిష్రా మాట్లాడుతూ జక్రాన్‌పల్లిలో ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించామన్నారు. ఫ్యూచర్‌లో జాతీయ రహదారిపై ప్రయాణికులకు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా చూడడం, ఎయిర్‌పోర్టు మొత్తం విస్తీర్ణం, రన్‌ వే ఓరియంటేషన్‌ తదితర విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామన్నారు. అనంతరం డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ప్రతినిధుల బృం దంతో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్‌ అండ్‌ బీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ రవీందర్‌ రావు, «ఆర్డీవో శ్రీని వాస్, తహసీల్దార్‌ కిషన్, ధర్పల్లి జెడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్, ఎంపీపీ దీకొండ హరిత, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు