ఫిర్యాదు చేసేలా ధైర్యమిద్దాం

2 Nov, 2017 04:11 IST|Sakshi

చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రచారం

3న పీపుల్స్‌ ప్లాజా వద్ద ప్రారంభం: డీజీపీ

సాక్షి, హైదరాబాద్‌: చిన్నారులపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు వారిలో ధైర్యం నింపాలని డీజీపీ అనురాగ్‌ శర్మ పేర్కొ న్నారు. వేధింపులకు గురైన చిన్నారుల విష యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులపై లైంగిక వేధింపులు– నియంత్రణపై ఏడాది పాటు ప్రచారం నిర్వహిం చేందుకు కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో మాట్లా డుతూ.. దేశవ్యాప్తంగా ప్రతి 30 నిమిషాలకో మైనర్‌ లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశా లలు, ఇళ్లల్లో, పనిచేసే చోట 53 శాతం మైనర్‌ బాలబా లికలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ చేసిన అధ్యయనంలో వెల్లడైందన్నారు. 13 రాష్ట్రాల్లో జరిగిన ఈ అధ్య యనంలో 12 లక్షల మంది మైనర్లు వేధింపులకు లోనవుతున్నారని, వీరిలో 57 శాతం అబ్బాయిలు ఉన్న ట్లు తెలిపారు.

సమాజంలో లైంగిక వేధింపుల నియం త్రణపై అవగాహన, చర్చ జరిగి పోలీస్‌స్టేషన్లలో ఫిర్యా దు చేసే వరకు బాధితులు రావాలని అభిప్రాయ పడ్డారు. ఇందుకు పోలీస్‌ శాఖతో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, వైద్య, పంచాయతీరాజ్‌ శాఖ, ఎన్జీవోలు, పాఠశాలలు కలసి పనిచేస్తాయని చెప్పారు. ఈ నెల 3న సాయంత్రం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌ పీపుల్స్‌ ప్లాజా వద్ద క్యాంపెయిన్‌ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొంటారని నోడల్‌ అధికారులు సౌమ్యామిశ్రా, చారుసిన్హా వెల్లడించారు. క్యాంపెయిన్‌ లోగోతో పాటు, ప్రచార గేయం, వెబ్‌పేజ్, ఫేస్‌బుక్, ట్వీటర్‌ ఖాతాలను డీజీపీ అనురాగ్‌ శర్మ, హైదరాబాద్‌ సీపీ మహేందర్‌రెడ్డి, రైల్వే డీజీ కృష్ణప్రసాద్, ఐజీలు సౌమ్య మిశ్రా, చారుసిన్హా ఆవిష్కరించారు. ప్రచార గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ను డీజీపీ సన్మానించారు.

ఆన్‌లైన్‌ వేధింపులు తీవ్రతరం..
మైనర్లపై భౌతికంగా జరిగే లైంగిక వేధింపుల కన్నా ఆన్‌లైన్‌ వేధింపులు తీవ్రతరంగా మారాయని డీజీపీ అనురాగ్‌ శర్మ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో రెండ్రోజుల పాటు పోలీసు అధికారులకు యూనెస్కో ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. టెక్నాలజీ వినియోగం పెరిగిన కొద్దీ చిన్నారులకు లైంగిక వేధింపులు పెరిగాయని, అధికారులు, సిబ్బంది టెక్నాలజీపై పట్టు సాధించి, వేధింపుల నియంత్రణకు కృషిచేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు