కరోనాపై పోలీస్‌ శాఖ అప్రమత్తం

19 Mar, 2020 15:06 IST|Sakshi

అన్ని జిల్లాల కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి తెలంగాణ పోలీస్‌ శాఖ అప్రమత్తం అయ్యింది.  అన్ని జిల్లాల కమిషనర్లు,ఎస్పీలతో గురువారం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఒక్కరోజే 8 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి)

కరోనా వైరస్‌పై అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా స్థానిక పోలీసులు చర్యలు చేపట్టాలని.. సభలు, సమావేశాలు, వివాహాలకు పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. నేడు సాయంత్రం ముఖ్యమంత్రి భేటీలో పోలీస్‌శాఖ తీసుకున్న నిర్ణయాలను చర్చించనున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. (‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’)

మరిన్ని వార్తలు