తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ నేతలు

1 Jul, 2019 11:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సచివాలయంలో పర్యటిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్‌, జీవన్‌ రెడ్డి, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు సోమవారం ఉదయం సచివాలయంలోని అన్ని బ్లాకులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా  సచివాలయం నిర్మాణాలు , నూతన నిర్మాణ భూమి పూజ ప్రాంగణాన్ని నేతలు పరిశీలించారు. కాగా అంతకు ముందు పోలీసులు... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వాహనాన్ని అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను ఎందుకు అడ్డగిస్తున్నారంటూ భట్టి విక్రమార్క సీరియస్‌ అయ్యారు. అలాగే ఆ పార్టీ సీనియర్‌ నేత వీ హనుమంతరావు వాహనాన్ని కూడా పోలీసులు మధ్యలోనే ఆపేశారు. అనంతరం వారిని లోనికి అనుమతించారు.కాగా నాగార్జునసాగర్‌లో శనివారం జరిగిన టీపీసీసీ సమావేశంలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సచివాలయ సందర్శన ప్రతిపాదన చేశారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్న రేవంత్‌ ప్రతిపాదనకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు ఇతర నేతలు కూడా ఏకీభవించడంతో సోమవారమే ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మళ్లీ ‘స్వైన్‌’ సైరన్‌!

కేన్సర్‌ ఔషధాల ధరల తగ్గింపు!

ఎంసెట్‌ స్కాంలో ఎట్టకేలకు చార్జిషీట్‌

యాప్‌ టికెట్‌.. టాప్‌

చెరువుల పరిరక్షణకు ముందుకు రావాలి

విన్‌.. సోషల్‌ ప్రొటీన్‌

అమల్లోకి ప్రైవేటు వర్సిటీల చట్టం

కళాత్మక దంపతులు

హీరా కుంభకోణంపై దర్యాప్తు ఇలాగేనా?

టిక్‌టాక్‌ చేసిన సిబ్బందిపై చర్యలు

దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

‘దామరచర్ల’కు డబుల్‌ ట్రాక్‌ లైన్‌

ఎర్రమంజిల్‌ భవనాన్ని హెచ్‌ఎండీఏ కాపాడాలి 

భూ రికార్డులను సంస్కరించాలి 

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

రుణమాఫీ గజిబిజి

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం.. చికిత్స నిలిపివేత

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఆగస్టు 31లోగా ఆర్టీఐ కమిషనర్లను నియమించండి

పాస్‌ పుస్తకం ఇవ్వడం లేదని టవర్‌ ఎక్కిన వ్యక్తి

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..! 

డొక్కు బస్సులే దిక్కు !

పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు

కథ కంచికేనా !

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం