ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టండి: గూడూరు

2 Jun, 2019 06:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కోరింది. ‘ఆరునెలల్లో కేసీఆర్‌ కేవలం కేబినెట్‌ సమావేశాలు మాత్రమే నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటై 169 రోజులు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గంలో ఆరు ఖాళీలున్నాయి. ఈ తరహా పాలన ప్రజాస్వామ్యాన్ని కాకుండా నియంతృత్వాన్ని తలపిస్తోంది’అని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికల నియమావళి పేరుతో ఆయన సెలవులు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ భృతి, రైతుబంధు సాయం పెంపు తదితర అంశాలను పరిష్కరించాలని, ఆర్థికంగా కుంగిపోతున్న రాష్ట్రం కోలుకునేందుకు ఆయన కొంతకాలం పాటు రాజకీయాలకు విరామం ఇచ్చి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు

>
మరిన్ని వార్తలు