దిశ మారితే దసరానే..!

8 Oct, 2019 03:22 IST|Sakshi
సోమవారం ఆర్టీసీపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌

కార్మికులకు బోనస్‌ ఇచ్చే స్థాయికి ఆర్టీసీని తీసుకొస్తాం

ప్రైవేటీకరించం.. మూడు రకాలుగా బస్సుల నిర్వహణ

50 శాతం బస్సులు ఆర్టీసీవే... మరో 30 శాతం సంస్థ ఆధ్వర్యంలోనే..

మిగిలిన 20 శాతం ప్రైవేటు బస్సులు... స్టేజి క్యారేజీ పద్ధతిలో నిర్వహణ

గడువులోగా చేరని వారంతా సెల్ఫ్‌ డిస్మిస్‌ అయినట్లే

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను లాభాల బాటలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, కారి్మకులకు బోనస్‌ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఆర్టీసీ సంస్థ ఉండి తీరాల్సిందేనన్నారు. ప్రజలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా చూసుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకు అనుగుణంగా ఆర్టీసీని పటిష్టం చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆరీ్టసీని పూర్తిగా ప్రైవేటీకరించడం వివేకవంతమైన చర్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

క్రమశిక్షణ అమలు చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి ముఖ్యమంత్రికి సమరి్పంచింది. ఈ ప్రతిపాదనలపై సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌రావు, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, అడిషనల్‌ డీజీపీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

యూనియన్లది అతిప్రవర్తన... 
ఆర్టీసీలో తాజా చర్యలన్నీ చేపట్టడానికి ప్రధాన కారణం యూనియన్ల అతిప్రవర్తనే కారణమని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. ‘‘వారెక్కిన చెట్టు కొమ్మను వాళ్లే నరుక్కున్నారు. గత 40 ఏళ్లుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇదంతా చేయాల్సి వచి్చంది. టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో సమ్మె చేసిన ఆర్టీసీ యూనియన్లు... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ సమ్మెకు దిగాయి. ఏ ప్రభుత్వమున్నా వాళ్ల అతిప్రవర్తనలో మార్పు లేదు. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ యాజమాన్యాలకు ఈ యూనియన్లు ఇవ్వవు. ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. పండుగలకు, విద్యార్థుల పరీక్షలకు, ఎవరూ కష్టపడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశం. 

సమ్మె ఉధృతం చేస్తామనడం హాస్యాస్పదం. ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1,200 మాత్రమే. మిగతా వారిని డిస్మిస్‌ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేనేలేదు. ఎవరూ ఎవర్నీ డిస్మిస్‌ చేయలేదు. వాళ్లంతట వాళ్లే తొలగిపోయారు. గడువులోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసినప్పటికీ గడువులోగా వారు చేరకపోవడంతో వాళ్లు ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’అయినట్లే. తొలగిపోయిన వారు డిపోల దగ్గర లేదా బస్‌ స్టేషన్ల దగ్గర గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించా. విధుల్లో ఉన్న 1,200 మంది తప్ప ఎవరు వచ్చి దురుసుగా ప్రవర్తించినా సరైన చర్యలు డీజీపీ తీసుకుంటారు.’’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

బస్సు పాసులు కొనసాగుతాయి... 
రాష్ట్రంలో ప్రస్తుతం విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందిన వారు, ఉద్యోగులు తదితరుల రాయితీ బస్సు పాసులు ఇక ముందు కూడా కొనసాగుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇవన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని, సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. అందుకు కావాల్సిన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. 

ఆరీ్టసీలో యూనియనిజం ఉండదు... 
ఆరీ్టసీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి... ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ఆరీ్టసీలో యూనియనిజం ఉండదని నిర్ణయించారు. ‘‘దురహంకారపూరితంగా సమ్మెకు వెళ్లడానికి కారణం యూనియన్ల నియంతృత్వ పొకడే కారణమని, ఇష్టం వచి్చన రీతిలో సమ్మె చేస్తామనడం దురహంకారమనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ సంస్థలో ఏది జరిగినా అది ప్రభుత్వ అనుమతితోనే జరగాలి. విధుల్లోకి రానివారు ఆర్టీసీ సిబ్బందిగా పరిగణించనప్పుడు ఇక యూనియన్ల ప్రసక్తే ఉండదు. 

యూనియన్లు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి. భవిష్యత్తులో ఆర్టీసీ అంటే ఒక అద్భుతమైన సంస్థగా రూపుదిద్దుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఆరీ్టసీని భవిష్యత్తులో లాభాలకు తెచ్చి కారి్మకులకు (కొత్తగా చేరే వారికి) బోనస్‌ ఇచ్చే పరిస్థితికి రావాలి. సంస్థ లాభాల్లో నడవాలి కానీ నష్టాల్లోకి పోకూడదు. ఆరీ్టసీకి కొత్త నెత్తురు, జవసత్వాలు రావాలి. రవాణా రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న పోటీ నేపథ్యంలో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థగా దేశంలోనే పేరుగాంచిన ఆర్టీసీ తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూనే ఆర్థిక పరిపుష్టిని సాధించుకొని లాభాల బాటలో పయనించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూక్ష్మ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

ఆర్టీసీ నిరంతరం చైతన్యంతో ప్రజలకు సేవలు అందించే సంస్థ. పండుగలు, పరీక్షల సమయాల్లో కారి్మక సంఘాలు సమ్మెలకు పిలుపిచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించే పరిస్థితులు కొనసాగుతున్నాయి. వాటిని రూపుమాపి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలను ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు.’’అని సీఎం పేర్కొన్నారు.  

బస్సుల విభజన ఇలా...
ప్రస్తుతం ఆరీ్టసీలో 10,400 బస్సులున్నాయి. వాటిని భవిష్యత్తులో మూడు రకాలుగా విభజించి నడపాలి. 50 శాతం.. అంటే 5,200 బస్సులు పూర్తిగా ఆర్టీసీకి చెందినవే. ఇవన్నీ ఆర్టీసీ యాజమాన్యంలోనే ఉంటాయి. 30 శాతంగా ఉన్న 3,100 బస్సులు అద్దె రూపేణా తీసుకొని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడుపుతాం. వాటిని కూడా ఆర్టీసీ డిపోల్లోనే ఉంచాలి. మరో 20 శాతంగా ఉన్న 2,100 బస్సులు పూర్తిగా ప్రైవేటువి. 

వాటిని స్టేజ్‌ క్యారేజీలుగా అనుమతిస్తాం. ఈ బస్సులను పల్లె వెలుగు సరీ్వసులుగానూ నడపాలి. అద్దె బస్సులు, స్టేజ్‌ క్యారేజీ బస్సులు ఇతర రూట్లతోపాటు హైదరాబాద్‌లో కూడా నడపాలి. ఆర్టీసీ చార్జీలు, ప్రైవేటు బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయి. వాళ్ల చార్జీలు కూడా ఆర్టీసీ పెంచినప్పుడే పెరుగుతాయి. ఇప్పటికే 21 శాతం అద్దె బస్సులను ఆర్టీసీ నడుపుతుంది. ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా 9 శాతం బస్సులే. అంటే ఆరీ్టసీకి కొత్త బస్సులు వచి్చనట్లే.

మరిన్ని వార్తలు