దసరా ముందు ఝలక్‌.. ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌

29 Sep, 2019 15:40 IST|Sakshi

అక్టోబర్‌ 5 నుంచి టీఎస్‌ ఆ‍ర్టీసీ సమ్మె

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండగ ముందు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు భారీ షాక్‌ ఇచ్చారు. అక్టోబర్‌ 5 నుంచి సమ్మె చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంతో కాలంగా వారు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. సెప్టెంబర్‌ 3న ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు లేఖ కూడా రాశారు. అయితే నెల గడుస్తున్నా దీనిపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఆగ్రహానికి వచ్చిన కార్మీకులు సమ్మె సైరన్‌ మోగించారు. ప్రభుత్వం తమతో కనీస సంప్రదింపులు కూడా జరపకపపోవడంపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఆర్టీసీ కార్మికుల డిమాడ్స్‌..
1. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
2. ప్రభుత్వం నుంచి బకాయిల చెల్లింపు
3. పట్టణాల్లో నష్టాలు ప్రభుత్వం భరించాలి
4. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
5. ఆర్టీసీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
6. మోటార్ వెహికల్ ట్యాక్స్ రద్దు చేయాలి
7. తార్నాక ఆస్పత్రిలో వైద్య సదుపాయం కల్పించాలి

>
మరిన్ని వార్తలు