విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు

29 Nov, 2019 06:38 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌/ఆదిలాబాద్‌/నిజామాబాద్‌: ఆర్టీసీలో నవ శకం మొదలైంది. 55 రోజుల తర్వాత తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పది డిపోల పరిధిలో 3,800 మంది కార్మికులు పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా ఆరు డిపోల వద్ద శుక్రవారం ఉదయం 3.30 గంటల నుంచి ఇప్పటివరకు దాదాపు 15 మంది కండక్టర్‌లు,డ్రైవర్లు విధుల్లోకి చేరారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు 5 గంటల నుంచే డ్రైవర్లు,కండక్టర్లు తొలి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్ కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల డిపోలో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరారు. మెదక్‌ జిల్లాలో 2,890, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 4,098 మంది కార్మికులు విధుల్లోకి చేరారు.

ఖమ్మం టౌన్‌: ఖమ్మం డిపోలో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరవుతున్నారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 2600 మంది విధులకు  హాజరుకానున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో కార్మికులు విధులకు హాజరయ్యారు.

చదవండి: డ్యూటీలో చేరండి 

మరిన్ని వార్తలు