డెల్టాకు నీటి విడుదలపై సందిగ్ధం!

21 Jun, 2014 00:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంపై తెలంగాణ సర్కారు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయం ప్రకారం ఈ నెల 25 నుంచి వచ్చే నెల 9 వరకు కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం భిన్నాభిప్రాయంతో ఉంది. తాగునీటి కోసం 10 టీఎంసీల నీరు అవసరం లేదని, తాగునీటి పేరిట నారుమళ్ల కోసం ఈ నీటిని వాడుకునే అవకాశం ఉందని భావిస్తోంది. అందుకే దీనికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం తెలంగాణ సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి చర్చించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు