చవులూరిస్తున్న ‘తెలంగాణ స్పైసీ కిచెన్‌’

4 Sep, 2018 08:10 IST|Sakshi

‘గోలించిన మాంసం, మక్క గారెలు విత్‌ కంట్రీ చికెన్‌

ముద్దపప్పు, పచ్చి పులుసుకు ప్రత్యేకం  

మస్తు రుచిగా ‘కరీంనగర్‌ ఫ్రైడ్‌ రింగ్స్‌’

లొట్టలు వేస్తూ ఆరగిస్తున్న నగరవాసులు

చిన్నప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మ  చేసిన వంటకాలు గుర్తొస్తే ఇప్పటికీ నోరూరుతూ ఉంటుంది. మళ్లీఆ రుచుల కోసం నాలుక తహతహలాడుతూ ఉంటుంది. మరి ఆనాటిఆ వంటకాలను రుచి చూడాలంటే పల్లెకు పరుగెత్తాల్సిందే. అలాంటి గ్రామీణ వంటకాలను సిటీ ప్రజలకు అందిస్తుంది‘తెలంగాణ స్పైసీ కిచెన్‌’రెస్టారెంట్‌. ఓసారి ఇక్కడికి మనమూ వెళ్లొద్దామా..ఆ రుచులను ఆస్వాదిద్దామా..

హిమాయత్‌నగర్‌ : కరీంనగర్‌కు చెందిన ‘రోహిత్‌రావు, వికాస్‌రావు, హర్ష, ఉదయ్‌’లు బంధువులు, స్నేహితులు.  తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రసిద్ధి చెందిన వంటకాలతో నగరంలో రెస్టారెంట్‌ను పెట్టాలనుకున్నారు. ఈ ఏడాది మే 28న జూబ్లిహిల్స్‌లో ‘తెలంగాణ స్పైసీ కిచెన్‌’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇక్కడ ముద్దపప్పు, పచ్చి పులుసు ఎంతో రుచికరంగా తయారుచేస్తున్నారు. వీటికోసం టెక్కీలు బారులు తీరడం విశేషం. అలాగే ‘గోలించిన మాంసం, మక్క గారెలు విత్‌ కంట్రీ చికెన్, దాల్చా మటన్‌ విత్‌ బగారా రైస్, పులిహోర విత్‌ కంట్రీ చికెన్‌’ వంటకాలను అందిస్తున్నారు. అలాగే కరీంనగర్‌లోనే ప్రత్యేకంగా లభించే ‘చికెన్‌ ఫ్రైడ్‌ వింగ్స్‌’  టేస్టీకి ఫిదా కావాల్సిందే. 

మరిన్ని వార్తలు