ఆర్థిక సంస్థల్లో రాష్ట్రానికి 12వ స్థానం

29 Mar, 2017 02:52 IST|Sakshi
ఆర్థిక సంస్థల్లో రాష్ట్రానికి 12వ స్థానం

ఆరో గణన వివరాలను విడుదల చేసిన మంత్రి ఈటల  
సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక సంస్థల సంఖ్యలో రాష్ట్రం దేశంలో 12వ స్థానంలో ఉంది. ఈ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు లేదా ఉపాధి పొందుతున్న వారి సంఖ్యలో పదో స్థానంలో ఉంది. జాతీయ స్థాయి లో నిర్వహించిన ఆరో ఆర్థిక గణన ప్రకారం ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిం చింది. దేశవ్యాప్తంగా 2013 ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఈ గణన నిర్వహించారు. అంత కు ముందు 2005లో నిర్వహించిన అయిదో ఆర్థిక గణనతో పోలిస్తే తెలంగాణలో ఆర్థిక సంస్థలు 77.94శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

ఆయా ప్రాంత పరిధిలో ఉన్న ఆర్థిక సంస్థలు, యూనిట్లను లెక్కించటమే ఆర్థిక గణన. జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ గణన ప్రకారం సరుకుల ఉత్పత్తి లేదా సేవల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వాటిని ఆర్థిక సంస్థలుగా పరిగణించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ మంగళ వారం సచివాలయంలో ఈ గణాం కాల సీడీ, పుస్తకాలు, రాష్ట్ర ప్రణా ళిక విభాగం రూపొందించిన వ్యవ సాయ విస్తీర్ణం, ఉత్పత్తికి సంబం ధించి మూడో ముందస్తు అంచనా గణాంకాలను విడుదల చేశారు.

హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్టు
తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ట్రాక్‌) ఆ«ధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరులను సమగ్రంగా గుర్తించే ప్రాజెక్టు అమలవుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్‌ జిల్లా పరిధిలోని హుజూ రాబాద్‌ నియోజకవర్గంలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు వివరాలను ప్రణాళిక విభాగం విడు దల చేసింది. ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, రాష్ట్ర అర్థగణాంక విభాగం డైరెక్టర్‌ ఎ సుదర్శన్‌రెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు