కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం

20 Feb, 2018 16:25 IST|Sakshi
మాట్లాడుతున్న చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌

ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌

సారంగాపూర్‌: కాళేశ్వరం ప్రాజెక్టుతో సగం తెలంగాణ సస్యశ్యామలం కానుందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సారంగాపూర్‌ మండలం పోతారం గ్రామ మహాలక్ష్మీ అమ్మవారి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవంలో పాల్గొని మాట్లాడారు. గోదావరి నుంచి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే సీఎం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్నారు.

ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణలోని 13 జిల్లాల్లోని రూ.38లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రోల్లవాగు ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.62కోట్లు వెచ్చిస్తుందన్నారు.  రివర్స్‌ పం పింగ్‌ ద్వారా ఏడాది పొడవునా నీరు ఉంటుందని తెలిపారు. ఎంపీపీ కొల్ముల శారద, ధర్మపరి జెడ్పీటీసీ బాదినేని రాజమణి, సర్పంచులు తోడేట శేఖర్, భైరి మల్లేశం, గుర్రం స్వామి, ఎంపీటీసీ మల్యాల సత్తెమ్మ, విండోచైర్మన్‌ సాగి సత్యంరావు, బాదినేని రాజేందర్, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ పాల్గొన్నారు.      

మరిన్ని వార్తలు