కేరళ చలో...రీచార్జ్‌ కరో..

25 Sep, 2019 09:13 IST|Sakshi

భూతల స్వర్గం, ప్రకృతి అందాల నిలయం అని కేరళను పర్యాటకులు కీర్తిస్తుంటారు. అక్కడి పచ్చని ప్రకృతిని.. జాలువారే జలపాతాలను.. హౌస్‌బోట్లను ఆస్వాదించని సిటీ టూరిస్ట్‌లు అరుదే. అయితే ఒకసారి కేరళను సందర్శిస్తే చాలని భావించే సిటీ టూరిస్ట్‌లు ఇప్పుడు తరచుగా కేరళ చలో అంటున్నారు. అవును మరి... ఇప్పుడు కేరళ సిటిజనుల రీచార్జ్‌ సెంటర్‌. ఐటీ ఉద్యోగులు, సంపన్నులు, గ్లామర్‌ రంగ ప్రముఖులకు రెగ్యులర్‌ విజిట్‌. కనీసం మూణ్నెళ్లకు ఒకసారైనా కేరళ వెళ్లడం పరిపాటిగా మారింది. దీనికి కారణం ఆ రాష్ట్రంలోని ఆయుర్వేద చికిత్సలే.– సాక్షి, సిటీబ్యూరో

సర్జరీ సమస్య తప్పింది
మోకాలి కీళ్ల సమస్యతో బాధపడేదాన్ని. నేల మీద కూర్చోలేనని తేల్చి చెప్పారు. మెట్లు ఎక్కలేనని చెప్పిన ఇక్కడి వైద్యులు నాకు కీహోల్‌ సర్జరీ సూచించారు. ఇద్దరు పిల్లల తల్లిగా ఇంట్లో నా పనులు చేసుకోకుండా ఉండలేను. చివరకు స్నేహితుల సూచన మేరకు కేరళలోని అస్టాముడిలో ఉన్న ఓ ఆయుర్వేదిక్‌ సెంటర్‌లో 21 రోజుల పాటు చికిత్స తీసుకున్నాను. సంపూర్ణంగా కోలుకున్నాను.  నా పనులన్నీ చేసుకోగలుగుతున్నా జిమ్‌కు కూడా వెళుతున్నా.  – కవిత, గృహిణి

విభిన్న రకాల మారథాన్‌లలో పాల్గొన్న అనుభవం ఉంది కానీ మారథాన్‌ని అడ్వెంచరస్‌గా అనుభూతించింది మాత్రం ఒకే ఒక్కసారి. గత వింటర్‌ సీజన్‌లో పుణెలోని ఈస్ట్రన్‌ ఘాట్స్‌ దగ్గర దీనిని ఒక సంస్థ నిర్వహించింది. మారథాన్‌ రేస్‌ మొత్తం హిల్స్‌ మీదే కావడం దీనిలోని విశేషం.  

మై అడ్వెంచర్‌హిల్స్‌లోరేస్‌
పుణె రైల్వే స్టేషన్‌ నుంచి 50కి.మీ దూరం ఈస్ట్రన్‌ ఘాట్స్‌కు వెళ్లాం కొండ కింద అందరికీ అవసరమైనవి అన్నీ అందించాక  రేస్‌ ప్రారంభమైంది. ఫోన్‌ సిగ్నల్స్‌ లేవు. కనుచూపు మేరలో మనుషుల్లేరు. నాది 25 కిలోమీటర్ల విభాగంలో రేస్‌. కొన్ని కిలోమీటర్లు నడిచాక పాలు పెరుగు అమ్ముకునే మరాఠా మహిళలు.. కొండల్లో వారిని చూస్తే వనకన్యల్లా ఎంత చక్కగా ఉన్నారో. చుట్టు పక్కల ఊర్ల నుంచి వచ్చి మా లాంటి ట్రెక్కర్స్‌ కోసం వీళ్లు అవి విక్రయిస్తుంటారు. కొండ ఎక్కేటప్పుడు పలు మార్లు జారిపడ్డా, దెబ్బలు తగిలాయి. హమ్మయ్య ఎక్కడం పూర్తయింది అనుకుంటే.. ఎక్కడం కన్నా దిగడం చాలా కష్టమని దిగేటప్పుడు అర్థమైంది.  ట్రాక్‌ చిరిగిపోయి చేతులకి దెబ్బలు కాళ్లకి దెబ్బలతో ఎలాగో పూర్తి చేశా. నిర్ణీత వ్యవధి 7గంటల్లో పూర్తి చేసి మెడల్‌ అందుకున్నా. అప్పుడు బాగా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పటికీ తలచుకుంటే ఆ అనుభవం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. జీవితంలో తొలి క్లిష్టమైన అడ్వెంచర్‌ అదే. మళ్లీ అలాంటివి చేయాలనిపించేంత మంచి జ్ఞాపకాన్ని అందించింది.  – భార్గవి, రేడియో జాకీ, యాంకర్‌

ట్రీట్‌...క్లీన్‌

‘‘ ఏ సమస్య ఉన్నా లేకున్నా నిర్ణీత వ్యవధిలో  కారు సర్వీసింగ్‌కి పంపుతాం కదా. అలాగే శరీరాన్ని కూడా కేరళకు పంపాలి’’ అంటూ అభిప్రాయపడ్డారు నగరానికి చెందిన వ్యాపార వేత్త కిరణ్‌.  ఆ ఏడాదిలో తలెత్తిన ఏవైనా ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి మాత్రమే కాక టాక్సిన్స్‌ను తొలగించుకోవడానికి, శరీరంలో పేరుకుపోయిన అన్ని రకాల చెత్తను శుభ్రపరచుకోవడానికి సిటిజనులు ఈ మళయాళీ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ‘‘మన వాళ్లింకా తక్కువని చెప్పాలి. ప్రతీ ఏడాదీ అక్కడకు వెళ్లినప్పుడల్లా భారతీయుల కన్నా పెద్ద సంఖ్యలో పాశ్చాత్యులు నాకు కనిపిస్తుంటారు. అంతేకాదు వారికి ఆయుర్వేద, నేచురోపతి చికిత్సలపై మంచి అవగాహన కూడా ఉంది’’ అని చెప్పారు ఐటి ఉద్యోగిని శ్రీకళ. ఓ వైపు వ్యయ భరితం కావడం మరోవైపు పూర్తి ప్రశాంతతను కోరుకోవడం వల్ల  ఇలాంటి చికిత్సలకు ఒంటరిగా లేదంటే బాగా సన్నిహితులతో మాత్రమే వెళుతున్నారు. శరీరం మొత్తం తిరిగి పునరుత్తేజం పొందేలా తిరిగొస్తున్నారు.

చర్మ సంబంధ సమస్యల  తీవ్రమైన ఒళ్లు నొప్పుల వంటి శారీరక సమస్యల నుంచి డిప్రెషన్, నిద్రలేమి వంటి సైకలాజికల్‌ సమస్యల దాకా  కేరళ పేరు జపిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే వెళ్లడం దగ్గర మొదలై ఏ సమస్య లేకపోయినా ఇప్పుడు ఏడాదికి ఆర్నెళ్లకు ఒకసారి తప్పక వెళ్లివచ్చేదాకా వచ్చేసింది.

ఈజీ ప్యాకేజీలూ...
విభిన్న ఆయుర్వేద కేంద్రాలు విభిన్న రకాల ప్యాకేజ్‌లు అందిస్తున్నాయిు. సిటీ నుంచి కేరళకు పెరిగిన టూరిస్టుల రద్దీతో అన్నీ కలగలిపిన ప్యాకేజ్‌లు కూడా టూర్‌ ఆపరేటర్లు ఆఫర్‌ చేస్తున్నారు.  రానుపోను చార్జీలు కాకుండా 3 పూటలా భోజనం, రోజుకు 3గంటల చికిత్స, యోగా, మందుల వినియోగం ఖర్చులు, రిసార్ట్స్‌లో బస వెరసి ఖరీదు రోజుకు రూ.5వేల నుంచి రూ.10వేల మధ్యలో ఉంటుంది. చికిత్స సందర్భంగా అక్కడ అందించే ఆహారం తక్కువ నూనెలతో తక్కువ స్పైసీగా ఉన్నా, రుచిగా ఉంటుందని అక్కడికి వెళ్లొచ్చినవారు చెబుతున్నారు. విరివిగా వినియోగించే గ్రీన్‌ చిల్లీస్, కొబ్బరి రుచిని పెంచుతాయని చెప్పారు.  

రోజుకి 8వేలైనా ఎక్కువనిపించలేదు...
ఏటేటా కేరళ వెళ్లి కొట్టాయంలోని ఓ ఆయుర్వేదిక్‌ సెంటర్‌లో పంచకర్మ చికిత్స చేయించుకుంటుంటా. దీనికి గాను రోజుకి 8వేలు చెల్లిస్తా. ఇదిæ వ్యయభరితంగా అనిపిస్తుంది. అయితే మన మానసిక ప్రశాంతత, ఆరోగ్యంతో పోలిస్తే ఇది అంత పెద్ద మొత్తం కాదు. పైగా ఇందులో బస, ఆహారం, వైద్య చికిత్స తదితర అన్ని ఖర్చులూ కలిపి ఉంటాయి.– ఎం.శ్రీరామ్‌నాథ్, ఐటి ఉద్యోగి

సీనియర్స్‌కు విల్లాలో ఉచిత బస
తరచుగా టూర్లు వెళ్లి రావడం, ఇష్టమైన చోటుకి పర్యటనలు చేయడం అనేది సిటిజనుల్లో అంతకంతకూ పెరుగుతున్న అభిరుచి. దీనిని దృష్టిలో ఉంచుకుని విభిన్న రకాల ప్యాకేజీలతో టూర్‌ ఆపరేటర్లు ఆకర్షిస్తున్నారు. వీరితో పోటీగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌ల  కోసం నిర్వాహకులు కూడా మరిన్ని హంగులతో, ఆకర్షణీయ పధకాలతో ముందుకు వస్తున్నారు. అదే తరహాలో ప్రముఖ సంస్థ విస్టా రూమ్స్‌ వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది.  

పెద్దలను హాలిడే వెకేషన్‌కి తీసుకెళితే వారికి ఉచితంగా తమ విల్లాలో బస అందిస్తామని అంటోంది విస్టా రూమ్స్‌. దక్షిణాసియా వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో బస ఏర్పాట్లలో పేరొందిన విస్టా రూమ్స్‌ 60ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్ల కోసం ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా పలు పర్యాటక ప్రాంతాల్లో తమకున్న 300కు పైగా వసతి భవనాల్లో సీనియర్స్‌ కోసం ఉచిత బస కల్పిస్తోంది.  ఈ నెల 15 న ప్రారంభమైన ఈ ఆఫర్‌  కేవలం నెల రోజులు అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. బిజీ లైఫ్‌లో పేరెంట్స్‌ సరదాలను తీర్చలేకపోతున్న పిల్లల్ని ప్రోత్సహించేందుకు దీన్ని అందిస్తున్నామని, వృద్ధులు ఎవరైనా సరే దీనిని ఉపయోగించుకోవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదనపు వివరాల కోసం  www.vistarooms.com లాగిన్‌ కావచ్చు.

గో.. గోవా...
 పార్టీ ప్రియులు ఇష్టపడే ప్లేస్‌ గోవా  అక్కడి షిప్స్‌ మీద విహరించే సిటిజనుల కోసం గోవాలోని డెల్టిన్‌ కాసినోస్‌ తాజాగా సరికొత్త డెల్టిన్‌ మ్యూజికల్‌ స్టార్స్‌తో ఆహ్వానిస్తోందని సంస్థ సిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రతి వారాంతంలో డెల్టిన్‌ రాయల్, డెల్టిన్‌ జేఎక్యుకె...షిప్‌లలోఇండియన్‌ ఐడల్, సరిగమప, ది వాయిస్, రా తదితర రియాలిటీ షోస్‌లో పాల్గొన్న సింగర్స్‌తో షోస్‌ మ్యూజికల్‌ స్టార్‌ పేరుతో ఈవెంట్స్‌ ఉర్రూతలూగిస్తాయన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బతుకమ్మ ఉత్సవాలు

కేటీఆర్‌ను కలిసిన అజహరుద్దీన్‌

దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

బ్రైడ్‌ లుక్‌... ఫిల్మీ స్టైల్‌

సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన విద్యుత్‌ బకాయిలు

ఆపద్బంధులా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ వింగ్‌

పండిద్దాం.. తినేద్దాం..

ధరల దూకుడు.. ఆగేదెప్పుడు!

ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో నభా నటేష్‌

సీపేజీ కాదు.. లీకేజీనే..

ముదురుతున్న గ్రానైట్‌ యుద్ధం

కేసులపై ఇంత నిర్లక్ష్యమా..?!

నగరం నిద్రపోతున్నవేళ 'నీటిలో సిటీ'

ఖానాపూర్‌లో కోర్టు కొట్లాట!

ఫలితమివ్వని ‘స్టడీ’

నిరుపయోగంగా మోడల్‌ హౌస్‌

వామ్మో.. పులి

స్వచ్ఛ సిద్దిపేటవైపు అడుగులు

తెలంగాణలో 2,939 పోస్టుల భర్తీకి ప్రకటన

బతుకునిచ్చే పూలదేవత

ఆయకట్టుకు గడ్డుకాలం

సీనియారిటీ కాదు..సిన్సియారిటీ ముఖ్యం

గుత్తా రాజీనామాను కోరండి

మూడు గంటల్లో.. 14.93  కుండపోత 

‘రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించండి’

టీఆర్‌ఎస్‌లోకి అజహరుద్దీన్‌?

నేడు, రేపు ‘జీరత్‌ పాత్‌ల్యాబ్స్‌’ అలర్జీ పరీక్షలు

గవర్నర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు 

క్లినికల్‌ ట్రయల్స్‌పై దుమారం

శ్రీశైలంలోకి 1,230 టీఎంసీలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమలా ఏమిటీ వైరాగ్యం!

అమ్మడు..కాపీ కొట్టుడు!

మనుషులా? దెయ్యాలా?

సీక్వెల్‌ షురూ

సెలవుల్లోనూ వర్కవుట్‌

జీవితం ప్రతి రోజూ నేర్పుతుంది