బతుకమ్మ నేపథ్యంతో తెలంగాణ శకటం

12 Dec, 2016 15:15 IST|Sakshi

నమూనాపై రక్షణశాఖ కమిటీ సంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఢిల్లీలో ప్రదర్శించే శకటాలకు సంబంధించి రక్షణ శాఖ ఉత్సవ విభాగ కమిటీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ శకటం నమూనాను పరిశీలించింది. డీఆర్‌డీఓ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కమిటీ అధికారులు శకటం నమూనాను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని సమావేశానికి హాజరైన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి.భాస్కర్ తెలిపారు.

బతుకమ్మ ఇతివృత్తంగా రూపొందించిన త్రీడీ శకటం నమూనాను సంగీతంతో పాటు కమిటీ ముందుంచినట్లు ఆయన చెప్పారు. కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించిన కమిటీ, మొత్తం మీద సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. శకటం నమూనాను రూపొందించిన ప్రముఖ కళాకారుడు రమణారెడ్డి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శకటాల ఎంపికలో కీలకమైన కమిటీ ఆరో సమావేశం వచ్చే నెల ఆరున జరుగుతుందని భాస్కర్ చెప్పారు.

మరిన్ని వార్తలు