తుది జాబితా ప్రకటన 

20 Nov, 2018 02:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 2,80,64,680 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద గత అక్టోబర్‌ 12న తొలి అనుబంధ జాబితాను ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పుడు రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,73,18,603గా ఉంది. ఆ తర్వాత ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని సోమవారం ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ జాబితాలో కొత్తగా 7,46,077 మంది ఓటర్లు చేరినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌ వెల్లడించారు. రెండో అనుబంధాన్ని ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పెడతామన్నారు. సోమవారం రాత్రి ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ముగిసిందన్నారు. 3 గంటల తర్వాత వచ్చిన వారి నామినేషన్లను స్వీకరించలేదన్నారు. ఇప్పటి వరకు ఆరు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలను సమర్పించాయని చెప్పారు.   
 

మరిన్ని వార్తలు