ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఇకలేరు

25 Jul, 2019 08:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి, సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ (75) గురువారం తెల్లవారుఝామున హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఆయనలేని లోటు సాహిత్య లోకానికి తీరనిదంటూ పలువురు  సంతాపం వ్యక్తం చేశారు. సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ శ్రీకాంతశర్మ తనయుడన్న సంగతి తెలిసిందే.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మే 29 ,1944 న జన్మించారు. 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరిన తదనంతరం కాలంలో ఆకాశవాణి కేంద్రానికి విశేష సేవలందించారు. అనేక​ లలిత గేయాలు కవితలు, సాహిత్యవ్యాసాలతోపాటు రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీతరూపకాలనురచించారు. కృష్ణావతారం (1982), నెలవంక (1983), రావు- గోపాలరావు(1984) మొదలైన చిత్రాలకు గీతరచన చేశారు. ఇటీవలి కాలంలో సమ్మోహనం సినిమాలో ‘మనసైనదేదో’ అనే రొమాంటిక్‌ సాంగ్‌ ఆయన కలం నుంచి జాలువారినదే.

సీఎం జగన్‌ సంతాపం
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఒక గొప్ప సాహితీవేత్త, పత్రికా సంపాదకుడు, కవి, పండితుడిని తెలుగుజాతి కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు