నిప్పుల కొలిమిలో రాష్ట్రం

11 May, 2015 01:11 IST|Sakshi
నిప్పుల కొలిమిలో రాష్ట్రం

హైదరాబాద్: రాష్ట్రం నిప్పుల కొలిమిలా కాగుతోంది. వాతావరణశాఖ అంచనా కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24గంటల్లో నిజామాబాద్‌లో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, రామగుండంలలో 43 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.

హైదరాబాద్ వాతావరణశాఖ వివరాల ప్రకారం గత 30 ఏళ్ల సరాసరిని పరిశీలిస్తే ఈ వారం నిజామాబాద్‌లో 41 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత నమోదు కావాలి. కానీ 44 డిగ్రీలు నమోదైంది. ఏకంగా 3 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో సాధారణంగా 42 డిగ్రీలు నమోదు కావాలి. కానీ 43 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్‌లో 39కి బదులు 40 డిగ్రీలు నమోదైంది. ఈ నెలలో ఎండలు, వడగాల్పులు మరింత ఉధృతం కానున్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. జూన్ నెల మొదటి వారం వరకు ఈ ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందని వాతావరణశాఖ అధికారి వెంకటేశం తెలిపారు.

మరిన్ని వార్తలు