మస్తుగా ఎండలు!

3 Apr, 2020 08:14 IST|Sakshi

ఈ నెల రెండో వారం తర్వాతనగరంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

పగటిపూట 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం  

ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌ విజృంభణ తక్కువ

అయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

48 గంటల్లో వర్ష సూచన

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం గరిష్టంగా 38.2 డిగ్రీలు, కనిష్టంగా 24.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 58 శాతం నమోదైంది. మరో వారం రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 37– 38 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల రెండోవారం తర్వాత పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల్లో వైరస్‌ సంబంధిత జబ్బులు విజృంభించే అవకాశాలు అంతగా ఉండవని.. అయిననప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాగా.. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో ఆకాశం మేఘావృతం కానుంది. రానున్న 48 గంటల్లో నగరంలో అక్కడక్కడా స్వల్పంగా వర్షం పడే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా కర్ణాటక నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి, ఉత్తర ఇంటీరియర్‌ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు