బర్నింగ్‌ సిటీ

17 May, 2019 12:20 IST|Sakshi

గ్రేటర్‌లో పెరుగుతున్న ఎండలు  

వారం రోజుల నుంచి వడగాడ్పులు  

సాక్షి,సిటీబ్యూరో: మండుటెండలు గ్రేటర్‌ సిటీజన్లను ఠారెత్తిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ 40 డిగ్రీలకు పైగా నమోదవుతోన్న గరిష్ట ఉష్ణోగ్రతలతో వాహనదారులు, ప్రయాణికులు, వృద్ధులు, చిన్నారులు విలవిల్లాడుతున్నారు. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వడదెబ్బ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఆయా ఆస్పత్రుల్లో వందల్లో వడదెబ్బ బాధితులు చేరినట్లు వైద్యఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వారం రోజులుగా ఎండలకు తోడు వడగాడ్పులు సైతం భయపెడుతున్నాయి. గురువారం నగరంలో పలు చోట్ల 42 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 48 శాతంగా నమోదైనట్లు బేగంపేట్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.

గురువారం పలు ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత (డిగ్రీల్లో) ఇలా..

ప్రాంతం    గరిష్ట ఉష్ణోగ్రత  
జూపార్కు    42.4
మాదాపూర్‌    41.8
బొల్లారం       41.3
అమీర్‌పేట్‌    41.3
పటాన్‌చెరు    41.1
మలక్‌పేట్‌    41.0
బండ్లగూడ    41.0
ఆసిఫ్‌నగర్‌    40.9
మౌలాలి    40.7
శ్రీనగర్‌కాలనీ    40.6
నారాయణగూడ    40.6 

మరిన్ని వార్తలు