‘టెన్‌’షన్‌ లేకుండా..

1 Mar, 2017 00:03 IST|Sakshi

గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో 2 గంటల్లో పది మందికి పురుడు పోసిన వైద్యులు

కోల్‌సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రికార్డుస్థాయిలో ప్రసవాలు జరిపించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల మధ్యలో పదిమంది గర్భిణులకు ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్, గైనకాలజిస్ట్‌ సూర్యశ్రీ, మరో గైనకాలజిస్ట్‌ వనితతోపాటు అనస్తీషియా డాక్టర్‌ ప్రియాంక కలసి పురుడుపోశారు. పుట్టిన వారిలో ఆరుగురు మగ శిశువులు, నలుగురు ఆడశిశువులు ఉన్నారు. వారికి అప్పటికప్పుడు పీడియాట్రిషన్‌ డాక్టర్‌ శిల్ప వైద్యం అందించారు.

పది మంది బాలింతలతోపాటు పుట్టిన పది మంది శిశువులు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సూర్యశ్రీ తెలిపారు. అయితే, అనుకోకుండా ఆపరేషన్లు జరిగాయని, రికార్డు కోసం చేయలేదని వెల్లడించారు. పదిమంది గర్భిణుల్లో ఐదుగురు గర్భిణులకు గతంలోనే పెద్ద ఆపరేషన్లు జరిగాయని, మిగిలిన వారికిS సాధారణ ప్రసవం జరిపేందుకు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో అందరికీ శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చిందని వివరించారు.

మరిన్ని వార్తలు