తెలంగాణలో మరో పది పాజిటివ్‌ కేసులు

8 May, 2020 19:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. కేసుల సంఖ్యమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో పది పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1132కి చేరిగింది. వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు 29 ​మంది మృతి చెందగా.. 722 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 376 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర  ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద​ర్‌ హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేశారు. (దేశంలో కొత్తగా 3390 పాజిటివ్‌ కేసులు)

అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన 14 జిల్లాలను గ్రీన్‌ జోన్‌గా ప్రకటించాలని కేంద్రాన్ని కోరామన్నారు. దీనిపై కేంద్ర నుంచి సోమవారం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. పాజిటివ్ వ్యక్తులతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటేనే టెస్టులు నిర్వహించాలని, వైరస్‌ లక్షణాలు ఉంటేనే టెస్ట్‌లు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌గా తేలిన మహిళకు వైద్యులు డెలివరీ చేశారని తెలిపారు. ప్రస్తుతానికి తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని అన్నారు. (ఈ ఏడాది చివరి వరకు వర్క్‌ ఫ్రం హోమ్‌!)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు