‘బోగస్’ ఏరివేత వేగవంతం

21 Jul, 2014 03:38 IST|Sakshi

- వారం రోజుల్లో పదివేల కార్డులు స్వాధీనం
- డీలర్లదే ముఖ్య పాత్రగా గుర్తించిన సివిల్ సప్లయ్ అధికారులు
- అక్రమ డీలర్ల వివరాలు రహస్యంగా ఉంచిన అధికారులు

 ప్రగతినగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ రేషన్ కార్డులపై ఉక్కుపాదం మోపింది. బోగస్ కార్డుల ఏరివేతను  వేగవంతం చేసిం ది. అర్హత లేకున్నా తెల్ల రేషన్ కార్డులను పొంది ప్రభుత్వ సొమ్మును అప్పనంగా పొం దుతున్న వారి భరతం పట్టడానికి చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో బోగస్ కార్డులను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించిం ది.ఈ దిశగా బోగస్ కార్డులు కలిగి ఉన్న కొంత మంది రేషన్ డీలర్ల వివరాలు సివిల్ సప్లయ్ ఎండీకి అధికారులు  పంపించారు.వారి వివరాలను రహస్యంగా దాచిపెట్టారు. బోగస్ కార్డుల కోసం అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సరెండర్ బాక్సులను ఏర్పాటుచేశారు.
 
అప్రమత్తమైన డీలర్లు
బోగస్ రేషన్ కార్డుల విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించడంతో బోగస్ కార్డులు కలిగి ఉన్న డీలర్లు ముందుగా అప్రమత్తమయ్యారు. దళారులను తహశీల్దార్ కార్యాలయాలకు పంపించి వారి దగ్గర ఉన్న కార్డులను సరెండర్ బాక్స్ లో వేసి జారుకుంటున్నట్లు తెలిసింది. జిల్లాలో మొత్తం 7,06,451 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో అంత్యోదయ కార్డులు 43,726,అన్నపూర్ణ కార్డులు 1106,ఆర్‌ఏపీ కార్డులు 90,390 రచ్చబండ మూడో విడతలో అం దించిన 63,458 కార్డులు, తెల్లరేషన్ కార్డులు  5,54 ,301, గులాబీ కార్డులు  40 వేల వరకు  ఉన్నాయి.
 
ప్రభుత్వం కూడా బోగస్ కార్డుల ఏరివేతలో డీలర్లను భాగస్వామ్యం చేద్దామని భావిస్తోంది. డీలరైతేనే షాపు పరిధిలో ఉన్న  బోగస్ లబ్ధిదారులను గుర్తిస్తాడని, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మొత్తం ఆయనకే అవగాహన ఉంటుందని భావిస్తోంది.
  ఇందులో భాగంగా ముందుగా డీలర్‌పై ఒత్తిడి తీసుకువస్తే బోగస్ కార్డులను సులువుగా ఏరివేయచ్చనే ఆలోచన కూడా ఉంది.   నిజామాబాద్ డివిజన్ పరిధిలో సుమారు 8 వేల కార్డులు,కామారెడ్డి డివిజన్ పరిధిలో 1200, బోధన్ డివిజన్ పరిధిలో  880 బోగస్ కార్డులు స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సరెండర్ బాక్సులో వేశారు.
 
నేటి నుంచి జిల్లాలోటాగింగ్ సిస్టమ్ అమలు
బోగస్‌కార్డులు కలిగి ఉన్నవారిని గుర్తించడానికి ప్రభుత్వం టాగింగ్ సిస్టిమ్  ఉపయోగించనుంది. జిల్లాలో సోమవారం నుంచి దీనిని ప్రారంభించనున్నా రు. ఈ టెక్నాలజీ ప్రస్తుతం తమిళనాడులో అం దుబాటులో ఉండగా, తెలంగాణ ప్రభుత్వం దీనిని ఇక్కడ కూడా అమలుచేయనుంది.  ఈ టాగింగ్  సిస్టమ్ ద్వారా బోగస్ కార్డులే కాదు బినామీ షాపులు, డీలర్ల ఆటకట్టించనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా ముందుగా బోగస్ డీలర్ల భరతం పట్టనున్నారు.

మరిన్ని వార్తలు