ఆక్రమణల కూల్చివేత: మహిళల ఆత్మహత్యాయత్నం

16 May, 2016 15:34 IST|Sakshi

జవహర్‌నగర్: రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో అధికారులు పేదల ఇళ్లను కూల్చివేయటం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో పోలీసులు గ్రామానికి చేరుకుని పేదల ఇళ్ల కూల్చివేత ప్రారంభించారు. నాలుగు ప్రొక్లెయినర్లతో ఇళ్లలోని పిల్లలు, మహిళలను బయటకు పంపించి, వారి సామగ్రిని చెల్లాచెదురు చేసి ఇళ్లను కూల్చివేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితులు నలుగురు మహిళలు కిరోసిన్ పోసుకుని, ఆత్మహత్యకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు, హెచ్చరికలు లేకుండా తమను రోడ్డున పడేస్తున్నారని అధికారులపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు