కబరస్థాన్‌ కూల్చివేత.. పరిస్థితి ఉద్రిక్తం

28 Jun, 2017 16:27 IST|Sakshi
హుజూరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో గల కబరస్థాన్ కూల్చివేత వివాదంగా మారింది. దీంతో గ్రామంలో పోలీసుల భారీగా మోహరించారు. గ్రామంలో ఉద్రికత పరిస్థితులు తలెత్తడంతో సంఘటన స్థలాన్నీ కమిషనర్‌ సందర్శించారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నెం.1660, 1661, 1662లలో ఐదు సంవత్సరాల క్రితం పంజల దుర్గయ్య భూమిలోని కొంత స్థలంలో ఖబరస్థాన్ నిర్మించారంటూ ఈద్గా కమిటీతో  భూతగాదా కొనసాగుతూ వస్తుందని తెలిపారు.
 
ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారు జామున దుర్గయ్య, మరో నలుగురు వ్యక్తులు కబరస్థాన్ కూల్చారంటూ ఈద్గా కమిటీ అధ్యక్షులు మహ్మద్ రఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలంలో ఏమి జరుగుతుందో తెలియక ఉద్రిక్తత నెలకొంది. సీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ముస్లిం మత పెద్దలు శాంతించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు