పరీక్ష తప్పానని ప్రాణం తీసుకుంది..!

20 May, 2015 04:10 IST|Sakshi
పరీక్ష తప్పానని ప్రాణం తీసుకుంది..!

‘ఖని’లో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
కోల్‌సిటీ : తొలుసూరి కాన్పులో ఆడపిల్ల పుడితే బంగారుతల్లి అని తల్లిదండ్రులు సంబురపడ్డారు. బాగా చదివి ప్ర యోజకురాలవుతుందని ఆశపడ్డారు. పెరిగి పెద్దాయ్యక, టెన్త్ చదువుతూ పరీక్షలో తప్పాననే మనోవేదనతో బాలిక బలవన్మరణానికి పాల్పడిం ది. కన్న వారికి శోకం మిగిల్చింది. ఈ సం ఘటన గోదావరిఖని గాంధీనగర్‌లో మూ డురోజుల తర్వాత మంగళవారం వెలుగు చూసింది. మృతురాలి తల్లిదండ్రులు తెలి పిన వివరాల మేరకు...

గాంధీనగర్‌కు చెందిన ఎనగందుల శ్రీనివాస్-లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. శ్రీనివాస్ ఆటో న డుపుతూ, లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పెద్దకూతు రు కృష్ణవేణి(15) స్థానిక సింగరేణి స్కూల్ లో పదో తరగతి చదివింది. ఆదివారం పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ ద్వారా ఫలితాలు చూసుకోగా మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైనట్లు తేలింది. మనస్తాపం చెందిన కృష్ణవేణి.. తాను టీచర్‌ను కలిసి వస్తానని తనతో వచ్చిన అత్తకూతురుకు చెప్పి ఇంటికి పంపించింది. అప్పట్నుంచి కనిపించకుండా పోయిన కృష్ణవేణి రాత్రి వరకూ ఇంటికి చేరలేదు.

ఈనెల 16న వరంగల్‌లోని తన మేనబావమరిది చనిపోయాడని తెలియడంతో శ్రీనివాస్ దంపతులు అక్కడకు వెళ్లారు. కృష్ణవేని కనిపించడంలేదనే విషయం తెలియడంతో వెంటనే గోదావరిఖనికి చేరారు. సోమవారం సా యంత్రం వరకూ కృష్ణవేణి ఆచూకీ కోసం గాలించారు. అయినా ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా మి స్సింగ్ కేసు నమోదు చేశారు.

అయితే, ఆది వారం కనిపించకుండా పోయిన కృష్ణవేణి స్థానిక పవర్‌హౌస్‌కు వెళ్లే దారి సమీపంలోని తుమ్మపొదళ్లలో చెట్టు కొమ్మకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్ పోలీసులు గుర్తించారు. అప్పటికే గాలిస్తున్న ఆమె కుటుంబసభ్యులు, బంధువులు విగతజీవిగా మారిన కృష్ణవేణిని చూసి కన్నీరుమున్నీరయ్యూరు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ మల్లారెడ్డి, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్ పరిశీలించారు. కృష్ణవేణి మిస్సింగ్ కేసును ఆత్మహత్య కేసుగా నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు