ఇంటర్‌ బోర్డు ఉద్యోగులకు టర్మ్‌ డ్యూటీస్‌ 

24 Mar, 2020 03:01 IST|Sakshi

ఆదేశాలు జారీ చేసిన ఇంటర్మీడియట్‌ బోర్డు

పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్యాశాఖల్లోనూ అమలు 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ బోర్డు, ఇంటర్మీడియ ట్‌ కమిషనర్‌ కార్యాలయం ఉద్యోగులు 20 శాతం మం ది రోజూ కార్యాలయాలకు రావాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి, ఇంటర్‌ విద్యా కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర పనులు ఉన్నం దున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 31 వరకు రొటేషన్‌ పద్ధతిలో రోజువారీగా హాజరు కావాల్సిన ఉద్యోగుల జాబితాతో ఉత్తర్వులు జారీచేశారు. పాఠశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖలో ఈనెల 31 వరకు 20 శాతం ఉద్యోగులే హాజరయ్యేలా ఆయా శాఖలు ఏర్పాట్లు చేశాయి. ఈనెల 20 నుంచి 31 వరకు రోజువారీగా ఏయే ఉద్యోగులు విధులకు హాజరు కావాలి? ఎవరు సెలవుల్లో ఉండాలన్న వివరాలతో కూడిన ఆదేశాలను ఆయా శాఖలు జారీ చేశాయి. అలాగే రొటేషన్‌ పద్ధతిలో ఎవరెవరు ఏయే రోజుల్లో హాజరు కావాలనే వివరాలతో ఆదేశాలను జారీచేశాయి. మిగతా ఉద్యోగులు ఈ– ఆఫీస్‌ విధానం లో ఇళ్ల నుంచే పని చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు