పుల్వామా ఉగ్రదాడి : పుట్టినరోజు వేడుకలు వద్దన్న కేసీఆర్‌

15 Feb, 2019 11:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జమ్మూకశ్మీర్‌ పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్ర దాడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కశ్మీర్‌లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని.. తాను కూడా తీవ్ర మనస్థాపానికి గురయ్యానన్నారు కేసీఆర్‌. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సీఎం కేసీఆర్ అభ్యర్థించారు. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు