పరీక్ష రాసే అభ్యర్థులకు బస్సులో ఉచితం

15 Mar, 2018 12:17 IST|Sakshi
ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌

నేటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు వర్తింపు

ఈ నెల 15 నుంచి వచ్చే నెల 2 వరకు సదుపాయం

ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌

మెదక్‌ జోన్‌: పదవ తరగతి పరీక్షలు ఈ నెల 15(నేటి) నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సదుపాయం కల్పిస్తునట్లు ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 2 వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రీ బస్‌పాస్‌ కానీ లేదా సబ్సిడీతో కూడిన బస్‌పాస్‌ కానీ కచ్చితంగా ఉండాలని చెప్పారు.

అలాంటి విద్యార్థు«లను మాత్రమే ఉచితంగా బస్సుల్లో తీసుకెళతారన్నారు. ఉదయం ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వద్దకు, మధ్యాహ్నం పరీక్షలు ముగిశాక మళ్లీ ఇంటివరకు వెళ్లొచ్చని  ఆయన చెప్పారు. జిల్లాలో 11,258 మంది పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉన్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు తప్పని సరిగా హాల్‌ టికెట్‌తో పాటు బస్‌ పాస్‌ను సైతం వెంటతీసుకుని రావాలని ఆయన చెప్పారు. పరీక్షలు అయ్యేంత వరకు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సైతం ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన  చెప్పారు.

మరిన్ని వార్తలు