‘టెట్’..అంతా రెడీ

16 Mar, 2014 04:02 IST|Sakshi

మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ అర్హతపరీక్ష(ఏపిటెట్) పరీక్ష నేడు(ఆదివారం) జరుగనుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఈఓ చంద్రమోహన్ వెల్లడించారు.  జిల్లా వ్యాప్తంగా 30,039 మంది అభ్యర్థులు ఏపిటెట్ పరీక్షకు హాజరు కానున్నారు.  ఉదయం 9.30గంటల నుంచి 12.00గంటల వరకు జరిగే పేపర్-1 పరీక్షకు 22 కేంద్రాలలో 5,170మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.00గంటల వరకు జరిగే పేపర్-2 పరీక్షకు 104 కేంద్రాలలో 24,869 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు.
 
 జిల్లా వ్యాప్తంగా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు 21మంది రూట్ ఆఫీసర్లు, 104మంది చీఫ్ సూపరింటెండ్‌లు, 126మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1040మంది ఇన్విజిలేటర్లను పరీక్షల విధుల్లో నియమించారు. శనివారం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డిఈఓ టెట్‌కు సంబంధించిన మెటీరియల్‌ను రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు  పంపిణీ చేశారు.  సిబ్బంది అధికారులు, సమయ పాలన పాటించాలని అన్నారు. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బంది ఉదయం 7గంటలకు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో హాజరై టెట్ ఇన్విజిలేషన్ నియామక ఉత్తర్వులు తీసుకొని సంబంధిత సెంటర్‌కు హాజరు కావాలని కోరారు. పరీక్షకు హాజరయ్యే వారు తమ వెంట ప్యాడ్, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను తప్పనిసరిగా తీసుకొని రావాలని సూచించారు. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు.
 

మరిన్ని వార్తలు