విచారణకు వచ్చిన పోలీసులపై దాడి

10 Sep, 2014 01:49 IST|Sakshi

మహబూబ్‌నగర్ జిల్లాలో హత్య కేసు విచారణ ను అడ్డుకున్న గ్రామస్తులు
 
తిమ్మాజీపేట: మహబూబ్‌నగర్ జిల్లా ఆవంచ గ్రామంలో ఓ హత్య కేసు విచారణకు వెళ్లిన పోలీసులను గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించే క్రమంలో గ్రామస్తులు పోలీసులపై దాడికి యత్నిం చారు. ఆవంచ గ్రామానికి చెందిన కర్నె పర్వతాలు(38) కాళ్లు బంధించి, నోట్లో పురుగుమందు పోసి సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. జడ్చర్ల సీఐ జంగయ్య  విచారణ కోసం డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు.

జాగిలం నేరుగా వెళ్లి అక్కడే గుంపులో ఉన్న మృతుడి సోదరుడు శ్రీనివాసులుతోపాటు అతని బావమరుదులు కృష్ణయ్య, రాజును పట్టిం చింది. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని తిమ్మాజీపేట పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్తుండగా.. కోపోద్రిక్తులైన గ్రామస్తులు పోలీసు జీపును అడ్డుకుని కిందపడేశారు. నాలుగు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎట్టకేలకు నిందితులను జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు