విజయీభవ!

18 Mar, 2015 08:13 IST|Sakshi

కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు జిల్లాల్లో 153 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 153 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో అబ్జర్వర్ ఉంటారు. అందులో వరంగల్ జిల్లాలో 60, ఖమ్మం జిల్లాలో 46, ఆదిలాబాద్ జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జంబ్లింగ్ విధానంలోనే ఒక కాలేజీ విద్యార్థులు మరో కాలేజీలో పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ పరిధిలో వరంగల్ జిల్లా ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రమే సెల్ఫ్ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. అక్కడ సమీపంలో మరో కాలేజీ లేకపోవటమే కారణం.


18 నుంచి ఏప్రిల్ 18 వరకు పరీక్షలు
మూడు జిల్లాల్లో కలిపి 2,33,782 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. బీఏ మొదటి సంవత్సరంలో 19,671, ద్వితీయ 13,874, తృతీయ 10,292, బీకాం మొదటి 31,182, ద్వితీయ 26,717, ఫైనల్ ఈయర్ 21,575, బీఎస్సీ మొదటి 43,182, ద్వితీయ 36,527, ఫైనల్ ఈయర్‌లో 29,707, బీబీఎం మొదటి 377, ద్వితీయ 353, ఫైనల్ ఈయర్‌లో 325 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. డిగ్రీ ఫస్టియర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. సెకండియర్, ఫైనల్ ఈయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటారుు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు డిగ్రీ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి, మూడో సంవత్సరం పరీక్షలు ఒకరోజు మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు.


ఏర్పాట్లు పూర్తి
పరీక్షలు పకడ్బందీగా నిర్వహంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి.వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. హాల్‌టికె ట్లు సంబంధిత కాలేజీల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచామన్నారు. ప్రిన్సిపాల్స్ లాగిన్ అయి హాల్‌టికెట్లను డౌన్‌లోడు చేసుకొవాలి. ఒక్కో జిల్లాకు రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్లను అందులో ఒక్కో స్క్వాడ్ బృందంలో నలుగరు చొప్పున డిగ్రీ కాలేజీల సీనియర్ లెక్చరర్లు ఉంటారు. జిల్లాకు ఒక స్పెషల్ స్కాడ్ కూడా ఉం టుంది. ఇందులో యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉంటారు. తనీఖీలు చేస్తారు. అబ్జర్వర్లలను నియమించామన్నారు. ప్రశ్నాపత్రాలు పోలీస్‌స్టేషన్‌లలోను, నోడల్ కాలేజీల్లోను అందుబాటులో ఉంచారు. వరంగల్ జిల్లాలో రూరల్ ఏరియాలో 7 పరీక్ష కేంద్రాల పరిధిలో, ఖమ్మంలో 12 పరీక్షా కేంద్రాల పరిధిలో, ఆదిలాబాద్‌లో 13 పరీక్షాకేంద్రాల పరిధిలో పోలీస్టేషన్‌లో ఉంచారు. మిగతా కేంద్రాలకు సంబంధిత పరీక్షా కేంద్రాల పరిధిలోని ప్రభుత్వ కాలేజీల్లోను అందుబాటులో ఉంచారు.

మరిన్ని వార్తలు