జాతరలో ఇరువర్గాల ఘర్షణ

29 May, 2015 01:19 IST|Sakshi

మనూరు : ఆటోల పార్కింగ్ విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కత్తులు, వేటకొడవళ్లు, రాళ్లతో దాడులకు దారి తీసింది. ఈ ఘటనను నివారించేందుకు యత్నించిన ఏఎస్‌ఐ, వీఆర్‌ఏలు గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని బోరంచ నల్లపోచమ్మ జాతరలో గురువారం చోటు చేటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామం, కర్ణాటకలోని సిరికంగ్టి గ్రామాలకు చెందిన భక్తులు గురువారం జాతరకు హాజరయ్యారు. కాగా.. వీరు పక్క పక్కనే బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఆటోల పార్కింగ్ విషయం లో వీరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు ఒక్కసారిగా ఝరాసంగం గ్రామానికి చెందిన భక్తులపై దాడులకు పాల్పడ్డారు.  
 
 వారి వెంట తీసుకువచ్చిన కత్తులు, వేట కొడవళ్లు, రాళ్లతో దాడులు జరపడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోచమ్మ ఆలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ ముజీబుద్దీన్, మరో ఇద్దరు కానిస్టేబుళ్ల, వీఆర్‌ఏ ముక్తర్‌లు ఘటనా స్థలానికి చేరుకుని గొడవను నివారించే ప్రయత్నం చేయ గా.. వారిపై కూడా కర్ణాటకకు చెందిన భక్తులు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఏఎస్‌ఐ, వీఆర్‌ఏలు గాయపడ్డారు. వీరి తో పాటు ఝరాసంగానికి చెందిన పెం టమ్మ (45), ఆటోడ్రైవర్ దశరథ్ (25), నిర్మల, మల్లేశంలకు తీవ్రగాయాలయ్యా యి. కాగా.. ఝరాసంఘానికి చెందిన పెంటమ్మ బంగారు ఆభరణాలు సైతం  లాక్కున్నట్లు సమాచారం.
 
 పట్టించుకోని పోలీసు ఉన్నతాధికారులు?
 మద్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన గొడువ అరగంట తర్వాత అదుపు తప్పడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ విషయాన్ని మనూరు స్టేషన్‌కు సమాచారం అందించారు. అ యితే రెండు గంటల తరువాత  కానిస్టేబుళ్లను జాతర వద్దకు  వచ్చి ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు