పల్లెల ప్రగతితోనే దేశ పురోగతి

15 Aug, 2014 23:14 IST|Sakshi

 జవహర్‌నగర్ : పల్లెలు ప్రగతిపథంలో పయనిం చినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పేర్కొన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శుక్రవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవహర్‌నగర్  పాఠశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. భానిస సంకెళ్ల విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన జాతీయ నేతల ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపుని చ్చారు. మహాత్ముడి కలల సాకారానికి ప్రతిఒక్కరూ కంకణబద్ధులు కావాల న్నారు.

 విద్యాపరంగా పల్లెలు పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల కల్పనతోనే గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని, ఇందుకు అవసరమైన సహాయసహకారాలు ప్రభుత్వాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా, చైనా తది తర దేశాలకన్నా భారత్ వేగంగా అభివృద్ధి చెంది భవిష్యత్‌లో ప్రపంచ దేశా ల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. రామకృష్ణమఠం అధ్యక్షుడు బోదోదయానంద మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలు, విన్యాసాలు ఆహూతులను అలరించాయి.
 

మరిన్ని వార్తలు