వరంగల్‌కు మరో వరం

5 Jan, 2016 01:10 IST|Sakshi

జిల్లాలోనే గిరిజన వర్సిటీ ప్రకటించిన సీఎం కేసీఆర్
టెక్స్‌టైల్ పార్క్‌పైనా స్పష్టత

 
వరంగల్ :    మన జిల్లాకు ఇప్పటికే విద్యా కేంద్రంగా పేరుంది. దీనికి తోడు మరో యూనివర్సిటీ కూడా వస్తుండడంతో ఆ పేరు మరింత సుస్థిరం కానుంది. గిరిజన విశ్వవిద్యాలయాన్ని మన జిల్లాలోనే ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. వరంగల్ నగర శివారులో లేదా ములుగులో  ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మన జిల్లాకు ఉన్న ప్రత్యేకతను మరోసారి చెప్పారు. టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుపై కూడా స్పష్టత ఇచ్చారు. భారతదేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కును త్వరలోనే వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరంగల్-ఆలేరు జాతీయ రహదారి(163) విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి మడికొండలో శంకుస్థాపన చేశారు. 99 కిలో మీటర్ల పొడవైన ఈ రహదారి పనులను రూ.1905 కోట్లతో పూర్తి చేయనున్నారు.

ఇదే కార్యక్రమంలో... ఏటూరునాగారం ము ల్లకట్ట, ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు మధ్య గోదావరి నదిపై రూ.340 కోట్లతో నిర్మించిన భారీ వంతెనను ప్రారంభించారు. ఈ సం దర్భంగా మడికొండలో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం.  వరంగల్ జిల్లాలో ఇప్పటికే ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉంది. సైనిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కాబోతున్నా యి. త్వరలో గిరిజన యూనివర్సిటీ రాబోతోంది. భా రతదేశంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పా ర్కు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఆజ్మీరా చందులాల్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జి.పద్మ, ఎంపీలు పి.దయాకర్, ఎ.సీతారాంనాయక్, బి.నర్సయ్యగౌడ్, జి.సుధారాణి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, టి.రాజయ్య, డి.వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, ఎం.యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, డీ.ఎస్.రెడ్యానాయక్, బి.శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, కొండా మురళీధర్‌రావు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, మడికొండ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పది నిమిషాలలోపే తన ప్రసంగాన్ని ముగించడంపై టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, సభకు వచ్చిన ప్రజలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
జిల్లాపై ప్రత్యేక దృష్టి
 ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా అభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి పెట్టారు. గత ఏడాది జనవరిలో జిల్లాలో నాలుగు రోజులు పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై అధికారులతో బుధవారం ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలా గే, జిల్లాకు సంబంధించి కొత్తగా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్ వరంగల్ మేయర్ స్థానాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా నగరాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మరి కొన్ని వరాలు ప్రకటించనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  
 

మరిన్ని వార్తలు