కరువు జిల్లాగా ప్రకటించాలి

26 Apr, 2016 02:24 IST|Sakshi
కరువు జిల్లాగా ప్రకటించాలి

హన్మకొండ అర్బన్ : జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించడంతోపాటు ఒక్కో మండలానికి కరువు సహాయక చర్యల కోసం రూ.10 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. బాలసముద్రంలోని ఏకశిల పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలె క్టరేట్ ఎదుట మండుటెండలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వరి పంటకు ఎకరానికి రూ.15వేలు పరిహారం చెల్లించాలని, అన్ని గ్రామాల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, వడదెబ్బతో మరణించిన వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని, కరువు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు.

పశువుల దాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  రైతులకు తాత్కాలిక పింఛన్ రూ.3వేలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు, సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, నాయకులు సిరబోయిన కరుణాకర్, పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు