ముగిసిన రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీలు

27 May, 2014 01:02 IST|Sakshi
ముగిసిన రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీలు

ప్రథమ స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా బృందం
మఠంపల్లి, న్యూస్‌లైన్, జ్యోతిప్రకాశ్ యువజన నాట్యకళామండలి ఆధ్వర్యంలో మఠంపల్లిలో ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీలు ఆదివారం అర్ధరాత్రి ముగిశాయి. ఈ పోటీల్లో కృష్ణా జిల్లా చందర్లపాడుకు చెందిన కస్తాల దుర్గారావు బృందం(సత్యహరి శ్చంద్ర కాటిసీను) ప్రథమ స్థానంలో నిలిచి  10,016 నగదు బహుమతిని సొంతం చేసుకుంది. అలాగే గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన అంజిరెడ్డి బృందం(గయోపాఖ్యానం నాటక సీను) ద్వితీయ స్థానంలో నిలిచి 8,016 నగదును గెలుపొందింది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సింగరి కొండయ్య బృందం(శ్రీకృష్ణరాయబారంలోని పడక సీను) తృతీయ స్థానంలో నిలిచి 6,016 నగదు బహుమతిని గెలుచుకుంది. అలాగే గుం టూరు జిల్లా పెదపాలెంకు చెందిన నీలం వెంకటేశ్వర్లు(హరిశ్చంద్ర కాటిసీను), నల్లగొండ జిల్లా నక్కగూడెంకు చెందిన దొంగరి పుల్లయ్య (హరిశ్చంద్ర వారణాసి), ఖమ్మం జిల్లాకు చెందిన మేకా రామ్మోహన్‌రావు(రామాంజ నేయ యుద్ధంలోని ఆంజనేయుని పాత్ర), హైదరాబాద్‌కు చెందిన ఎం.అర్జున్‌రావు(మహిషాసుర మర్దిని) ప్రోత్సాహక బహుమతులు గెలుపొందారు.
 
ఏకపాత్రభినయంలో..
ఏకపాత్రాభినయంలో పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరుకు చెందిన చిత్రినాథ్‌రాజు(దృతరాష్ట్రుడు) ప్రథమ స్థానంలో నిలిచి 4,016, నల్లగొండ జిల్లా మట్టపల్లికి చెందిన వెంకటశివ(నక్షత్రకుడు) ద్వితీయ బహుమతిగా *3,016, మేళ్లచెరువుకు చెందిన కోడూరు వెంకటరమణ(వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలోని ఈశ్వరమ్మ) తృతీయ బహుమతిగా 2,016 అందుకున్నారు. అలాగే నల్లగొండ జిల్లా చిలుకూరుకు చెందిన పొందూరు సత్యనారాయణ(దుర్యోధనుడు), అల్లీపురంకు చెందిన కొత్త్త భద్రయ్యాచారి(హరిశ్చంద్ర కాటిసీను), గుంటూరు జిల్లా క్రోసూరుకు చెందిన ఉల్లంగుల నర్సింహా రావు(అర్జునుడు), కృష్ణా జిల్లా పెడనకు చెందిన ముత్యాల ఏసుబాబు(అంధుడు) ప్రోత్సాహ బహుమతిగా 600 చొప్పున గెలుపొందారు.

అదేవిధంగా ప్రతిభ కనబర్చిన మరో 15మంది కళాకారులకు ప్రత్యేక జ్యూరీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళానాట్యమండలి అధ్యక్ష, కార్యదర్శు లు బోనగిరి ప్రకాశ్‌బాబు, గుంటి పిచ్చయ్య, ప్రభాకర్‌రెడ్డి, ఎరగాని నాగన్నగౌడ్, గోలి వెంకటేశ్వర్లు, బత్తిని ధర్మయ్యగౌడ్,  జగ్గయ్య, రామారావు, ఆనంద్, జోసు, వ్యాఖ్యాత భవాని, న్యాయనిర్ణేతలు బాలకోటయ్య, పట్టాబిదాసు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు