అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

21 Oct, 2015 09:33 IST|Sakshi

అప్పుల బాధతాళలేక పండగపూట ఓ రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారు జామున సూర్యాపేట నియోజకవర్గంలోని చిదేముల్‌లో జరిగింది. చిదేముల్‌కు చెందిన దారావత్ దేవ్(55)కు ఆరు ఎకరాల పొలం ఉంది. భూమి సాగు కోసం.. పిల్లల పెళ్లిళ్ల కోసం ఆరు లక్షల రూపాయలు అప్పు చేశాడు.


అప్పు తీర్చేందుకు ఈ ఏడాది తనకున్న పొలంతో పాటు.. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిపంట వేశాడు. సరైన వర్షాలు లేక పంట ఎండిపోయింది. అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరిగింది. దీంతో రెండెకరాల పొలం అమ్మి మూడు లక్షలు అప్పుతీర్చాడు.


కానీ.. రుణాల వత్తిడి తగ్గలేదు.. దీంతో మనస్ధాపం చెందిన ధరావత్ బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కాపాడి. ఆస్పత్రిలో చేర్చారు.

తీవ్రగాయాల పాలైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పండగపూట ఆ ఇంట విషాదం నెలకొంది. ధరావత్ కు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురికి పెళ్లి కాగా.. మరో పెళ్లీడుకొచ్చిన ఆమ్మాయి ఉంది.
 

మరిన్ని వార్తలు