నామినేషన్ల వరద

14 Mar, 2014 04:33 IST|Sakshi

పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో నామినేషన్లు వెల్లువెత్తాయి. నాలుగోరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆయా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వద్ద అభ్యర్థులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దీంతో ఆయా కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో సందడి నెల కొంది.

వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచేందుకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు సమర్పించారు. ఒక్కరోజే గడువు ఉండడం, పొత్తులు కొలిక్కి రావడంతో గురువారం ఒక్క రోజే 798 నామినేషన్లను అభ్యర్థుల నుంచి అధికారులు స్వీకరించారు. కోదాడ మున్సిపాలిటీలో అత్యధికంగా 166 నామినేషన్లు దాఖలయ్యాయి.

నల్లగొండలో 148, మిర్యాలగూడలో 124, సూర్యాపేటలో 105, భువనగిరిలో 99, దేవరకొండ నగరపంచాయతీలో 83, హుజూర్‌నగర్ నగరపంచాయతీలో 73 నామినేషన్లను అభ్యర్థుల నుంచి అధికారులు స్వీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం మూడుగంటల వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు