‘అమ్మాయిపుడితే లక్ష్మీదేవి అనుకోవాలి’

10 Mar, 2017 21:15 IST|Sakshi
‘అమ్మాయిపుడితే లక్ష్మీదేవి అనుకోవాలి’

హైదరాబాద్‌సిటీ: ప్రతి ఇంట్లో అమ్మాయి పుడితే లక్ష్మీదేవి పుట్టిందనుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్‌ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. వంట గ్యాస్ మీద సబ్సిడీ వదులుకునే పధకం మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశ పెట్టినదేనని తెలిపారు.

పేదలను, మహిళలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ పాలన కొనసాగుతున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణా మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లేదంటే ప్రభుత్వ వైఖరి మహిళలపట్ల ఏమిటో మీరు అర్ధం చేసుకోవాలని తెలిపారు. వారసత్వ రాజకీయాలకి బీజేపీలో అవకాశం లేదని స్పష్టం చేశారు. జాజుల గౌరీ లాంటి మహిళా కార్యకర్తను రాష్ట్ర నాయకురాలుని చేసిన ఘనత బీజేపీదేనన్నారు. 33 శాతం వాటా కోసం అందరం కృషి చేయాలన్నారు. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలం పంచపాండవులు లెక్క ధర్మం కోసం పోరాడుతున్నామని పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు