అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయం

9 Mar, 2017 16:27 IST|Sakshi
అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని అందులో భాగంగానే వీఓఏల వేతనాలను పెంచినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లికృష్ణారావు అన్నారు. బుధవారం స్థానిక రాయల్‌ ఫంక్షన్‌హాల్‌లో ప్రభుత్వం వీఓఏల వేతనాలను పెంచడంపై వీఓఏలు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గా ల అబివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుం దన్నారు. గతంలో వీఓఏలను పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పారు. చాలీ చాలని వేతనాలతో ఇబ్పందులు పడుతు న్న వారికి రూ. 5వేల వేతనం పెంచినట్లు తెలిపారు. ఇందులో రూ.3వేలు నేరుగా ప్రభుత్వ ఖాతా నుంచి రాగా, మిగతా రూ.2 వేలు ఆ స్థానిక మహిళ సంఘాల నుంచి చెల్లించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మందికి వేతనాలను పెంచినట్లు తెలిపారు. వీఓఏలు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణం గా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తు న్న ప్రతి సంక్షేమ పథకంపై గ్రామాల్లో మహిళలకు అవగాహన కల్పించాలని కోరారు. మహిళలకు పొదు పు మంత్రం నేర్పడంతోపాటు వారి అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యల గురిం చి కూడా అవగాహన కల్పించాలని కోరా రు. మహిళల్లో అక్షర జ్ఞానాన్ని పెంచేం దుకు కృషిచేయాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వచ్చే 5నెలల్లో సంపూర్ణ పారిశుధ్యం సాధించాలని ఇందు కోసం 100శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రొత్సహకాలు ఇస్తోందన్నారు. స్త్రీనిధి నుంచి అడ్వాన్సులను ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో మహిళలు చైతన్యం కావాలని ఆ దిశగా వీఓఏలు కృషిచేయాలని అన్నారు. గ్రామాలు స్వయం సంవృద్ధి చెందాలన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేసి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.


పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత వీఓఏలపై ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరిస్తుందని, కొంత ఆలస్యం అవుతుందేమోకాని పరిష్కారం మాత్రం పక్కా అని చెప్పారు. ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అందుకోసం ప్రణాళికలను సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలనే తపనతో సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని చెప్పారు. అడిగిన ప్రతిఒక్కరికి పని కల్పించేందుకు సీఎం కేసీఆర్‌పని చేస్తున్నారని ఈజీఎస్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కోట్లకిషోర్‌ అన్నారు. గతంలో నిర్లక్ష్యం చేసిన రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, డీపీఓ నాగమల్లిక, వీఓఏ సంఘం నాయకులు సత్యనారాయణగౌడ్, నర్సిములు, గోపాల్, శ్రీనివాస్, రాఘవేందర్‌గౌడ్, రాంచంద్రయ్య, కృష్ణ, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు