రూ.45.72 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

31 Aug, 2014 00:03 IST|Sakshi
రూ.45.72 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘జలమణి’ పథకం కింద జిల్లాలో 254 పాఠశాలల్లో తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పాఠశాలకు రూ.18 లక్షలను కేటాయించిన ప్రభుత్వం.. జిల్లాకు రూ.45.72 కోట్లను విడుదల చేసింది. జాతీయ గ్రామీణాభివృద్ధి, నీటి ప్రాజెక్టు (ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ) కింద తెలంగాణలో 4,005 స్కూళ్లలో జలమణి కింద మంచినీటిని అందుబాటులోకి తేవాలని సంకల్పించింది. అంచనా వ్యయంలో 50శాతం నిధులను గ్రాంట్ రూపంలో కేంద్రప్రభుత్వం అందిస్తుంది. మిగతా సగం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ నిధులతో నిర్దేశిత పాఠశాలల్లో సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని వార్తలు