ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది: ఉత్తమ్

1 Apr, 2017 19:59 IST|Sakshi
ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది: ఉత్తమ్
మిర్చి ధరపై 3న కాంగ్రెస్‌ ధర్నాలు
 
హైదరాబాద్‌: మిర్చి రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఈనెల 3న నియోజక వర్గ కేంద్రాలలో కాంగ్రెస్ ధర్నాలు చేపడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మిర్చికి గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు. 
 
రైతును ఆదుకోవాల్సిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. మిర్చి రైతులకు న్యాయం చేయాలని, పంటను ప్రభుత్వమే కొనాలని.. క్వింటాల్ కు రూ.12 వేలు దక్కేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 3వ తేదీ సోమవారం కాంగ్రెస్‌ శ్రేణులు నియోజక వర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తాయని తెలిపారు. తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేసి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగడతామని తెలిపారు.
మరిన్ని వార్తలు