ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

4 Mar, 2016 01:30 IST|Sakshi
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

డ్వామా పీడీ వైవీ గణేశ్
ఉపాధి హామీ లైఫ్ ప్రాజెక్టుపై అవగాహన

 
 
 ముకరంపుర : ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను సద్వినియో గం చేసుకుని అభివృద్ధి చెందాలని డ్వామా పీడీ వైవీ గణేశ్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి, నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలపై గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం కొత్తగా లైఫ్ ప్రాజెక్టు కార్యక్రమం చేపట్టిందన్నారు.  ఇందులో భాగంగా ఉపాధిహామీలో రెండేళ్లపాటు వందరోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబంలోని 18-35 సంవత్సరాల యువతీయువకులను గుర్తించి వివిధ విభాగాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధిమార్గం చూపుతామన్నారు. వంద పనిదినాలు పూర్తిచేసిన కుటుంబాల్లో 12,857మందిని ఈ కార్యక్రమానికి ఎంచుకోగా.. 805 మందిని వృత్తి నైపుణ్యత శిక్షణకు, 693 మందిని స్వయం ఉపాధికి, 803మందిని జీవనోపాధికి ఎంపిక చేసినట్లు తెలిపారు.

లేడీస్ టైలరింగ్, ఎలక్ట్రిక్ మోటార్ రివైండింగ్, పంప్‌సెట్ల నిర్వహణ, టీవీ, డీవీడీలు, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్ రిపేరింగ్, డెరుురీ నిర్వహణ, గొర్రెల పెంపకం, అగర్‌బత్తుల తయారీ, పేపర్‌బ్యాగ్‌లు, పేపర్ ప్లేట్‌ల తయారీ, బ్యూటీపార్లర్ నిర్వహణ, సెల్‌ఫోన్ల రిపేరు, కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ బేసిక్స్, లైట్ మోటార్ వాహనాల డ్రైవింగ్, బొమ్మల తయారీ, కూరగాయ ల నర్సరీ, సాగు, దుస్తుల అద్దకం, కొవ్వొత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

దీంతోపాటు న్యాక్ ద్వారా ఎలక్ట్రీషియన్, ప్లంబర్ తదితర డిమాండ్ ఉన్న వృత్తులలో శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తమ అభిరుచిని బట్టి శిక్షణకు కార్యక్రమ స్థలివద్ద ఉన్న స్టాల్స్‌లో పలువురు పేర్లు న మోదు చేసుకున్నారు. మైనార్టీ ఈడీ హమీద్, జిల్లా ఉపాధికల్పనాధికారి రవీందర్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, ఎస్‌బీహెచ్ మేనేజర్ జయప్రకాశ్, నాక్ డెరైక్టర్ హేమా బూక్యా , వారధి కార్యదర్శి ఆంజనేయులు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణం మేనేజర్ ఉమారాణి, ఉపాధికూలీల కుటుంబాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు