గోవధ నిషేధ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి: సురవరం

7 Jun, 2017 01:56 IST|Sakshi
గోవధ నిషేధ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి: సురవరం

సాక్షి, హైదరాబాద్‌: గొడ్డు మాంసంపై నిషేధంలేదని, గోవు లను వధశాలలకు తరలించడాన్నే నిషేధించినట్లు పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నా రని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గోవధ నిషేధ చట్టాన్ని వెంటనే ఉపసంహరిం చుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అశాస్త్రీయమైన అవగాహనతో సంఘ్‌పరివార్‌ అనారోగ్యకరమైన వాతావర ణాన్ని సృష్టిస్తోందన్నారు. గోవధ నిషేధచ ట్టంపై మంగళవా రం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయనపై విధంగా స్పం దించారు.

మాంసా హారుల్లో 60 నుంచి 70 శాతం మంది గొడ్డుమాంసం తినేవారు న్నారని, ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు ఉన్నందున అధికంగా భుజిస్తు న్నారని చెప్పా రు. భిన్నమైన పద్ధతుల్లో మాంసాహారాన్ని నిరుత్సాహ పరిచేందుకు, శాకా హారాన్ని పెంచేందుకు సంఘ్‌పరి వార్‌ ప్రయత్నిస్తోందన్నారు. శ్వాస పీల్చే సమయంలో సూక్ష్మక్రిములు శరీరం లోకి వెళ్లాక మరణించ కుండా ఉండేందుకు జైనమతస్థు లు ముక్కుకు, నోటికి గుడ్డను అడ్డుపెట్టుకుం టారన్నారు. ఈ విధంగా ప్రతీది జంతు హింస అంటే అందరూ జైనులుగా మారాల్సిందేనని అన్నారు.

రైతుల మృతిపై న్యాయ విచారణ
మధ్యప్రదేశ్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో అయిదుగురు రైతులు  మరణించడం పట్ల సీపీఐ జాతీయ సెక్రటేరియట్‌ పక్షాన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనికి కారకులైన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేసి ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు