ఇక ఐటీ బూమ్..

31 Dec, 2015 01:29 IST|Sakshi

వరంగల్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్
ఫిబ్రవరిలో వెలువడనున్న ప్రకటన?
మైసూర్ తరహాలో శిక్షణ  కేంద్రం
నగరంలో నెలకొల్పేలా ప్రభుత్వం కృషి

 
హన్మకొండ :  అధునాతన కార్యాలయాలు, ఆక ర్షణీయమైన వేతనాలు, అబ్బురపరిచే జీవన శైలికి ప్రతీకలుగా నిలిచే ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగానికి హైదరాబాద్ తర్వాత మరో వేదికగా వరంగల్ నిలువబోతోంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం  చేపడుతున్న చర్యలు ఫలప్రదమైతే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇన్ఫోసిస్ ట్రైనింగ్ క్యాంపస్ ఓరుగల్లులో ఏర్పాటు కానుంది.
 
మైసూర్‌లో ట్రైనింగ్ క్యాంపస్..

ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ సంస్థ ఓ దిగ్గజంగా పేరుగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో     1.80 లక్షల మంది ఉద్యోగులు ఈ సం స్థలో పని చేస్తున్నారు. దీని ప్రధాన కా ర్యాలయం బెంగళూరులో ఉంది. ప్రతి ఏటా కొత్తగా వేలాది మంది ఉద్యోగుల ను నియమించుకుంటోంది. కొత్తగా చేరి న వారికి సంస్థ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తుంది. ప్రధాన కార్యాల యం ఉన్న బెంగళూరులో గతంలో శిక్షణ ఇచ్చేది. అయితే నగరంలో స్థల లభ్యత, నిర్వహణ ఖర్చు తదితర అంశాలను బేరీజు వేసుకుని బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూర్‌లో సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో 10 వేల మందికి శిక్షణ ఇచ్చేలా పదేళ్ల క్రితం ట్రైనింగ్ క్యాంపస్ నెలకొల్పింది. ఈ క్యాంపస్‌లో ఫుల్ ఫర్నీచర్‌తో 2 వేల గదులు, స్విమ్మింగ్‌పూల్, ఫుడ్‌కోర్‌‌ట, థి యేటర్ తదితర  సౌకర్యాలు ఉంటాయి. వివిధ కళాశాలల నుంచి క్యాంపస్ ఇంట ర్వ్యూల ద్వారా ఎంపికైన వారికి  అక్కడ శిక్షణ ఇస్తుంది. సంస్థ ఉద్యోగులకూ నైపుణ్య శిక్షణను ఇక్కడే నిర్వహిస్తుంది.

ఇక్కడ వరంగల్‌లో..
ప్రస్తుతం ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాల యంతో పాటు ఉద్యోగుల పరంగా బెం గళూరు ప్రథమస్థానంలో ఉంది. దేశం లో బెంగళూరుకు పోటీగా ఐటీ రంగం లో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో గచ్చిబౌలి వద్ద 10 వేల మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ సంస్థ పనిచేస్తోంది. దీ నికి తోడుగా పోచారం గ్రామం వద్ద 25 వేల మంది ఉద్యోగులు పని చేసే లా మ రో కార్యాలయం నిర్మిస్తోంది. దీంతో ఆ సంస్థకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద  క్యాంపస్‌గా హైదరాబాద్ అవతరించనుంది. తదనుగుణంగా పెద్ద ఎ త్తున ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. బెంగళూరు-మైసూర్ ఫా ర్ములా తరహాలో హైదరాబాద్ క్యాంపస్‌కు అనుగుణంగా వరంగల్‌లో ఉద్యోగుల శిక్షణా కేంద్రం నిర్మించేందుకు గల అవకాశాలను పరిశీలించాలంటూ ఇన్ఫోసిస్ ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించగా.. సానుకూలత తెలిపినట్లు సమాచారం.

ఫిబ్రవరిలో ప్రకటన ?
హైదరాబాద్‌లో పోచారం వద్ద నిర్మిం చిన క్యాంపస్‌ను 2016 ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సమయంలోనే వరంగల్‌లో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సంబంధిం చి ప్రకటన వచ్చేలా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. రైల్వే పరంగా చెన్నై-న్యూఢిల్లీ మార్గం వరంగల్ మీదుగా వెళ్తుం డటం, హైదరాబాద్-వరంగల్ మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మా ణం వంటి అంశాలు వరంగల్‌కు సానుకూలంగా మారనున్నాయి. భౌగోళికంగా వరంగల్ నగరం దేశానికి మ ధ్య ప్రాంతంలో ఉండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. హైదరాబాద్ క్యాంపస్‌తో పాటు పుణే, ఢిల్లీ ఇన్ఫోసిస్ క్యాంపస్‌ల్లో ఉన్న ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు అనువుగా ఉం టుం ది. భూకంపాలు, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కూడా వరంగల్‌కు తక్కువే. ఇవన్నీ అనుకూల అంశాలుగా పేర్కొనవచ్చు.

ఇప్పటికే ఇంక్యూబేషన్ సెంటర్..
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం క ల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది న్నరగా సన్నాహాలు చేస్తోంది. అందు లో భాగంగా వరంగల్ మడికొండలో ఇప్పటికే ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. అంతేకాక రెం డేళ్లుగా కాకతీయ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్‌‌కలో 25  కంపెనీలు పని చేస్తున్నా యి. మొత్తంగా వరంగల్‌లో 100 లోపే ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. ప్రతి ష్టాత్మక ఇన్ఫోసిస్ ట్రైనింగ్ సెంటర్ వరంగల్ వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుంది.

మరిన్ని వార్తలు