స్వచ్ఛభారత్‌లో జిల్లాకు ప్రశంస

5 Apr, 2016 01:58 IST|Sakshi
స్వచ్ఛభారత్‌లో జిల్లాకు ప్రశంస

ఢిల్లీ సదస్సులో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్
 
కరీంనగర్ సిటీ : స్వచ్ఛభారత్‌లో రాష్ట్రంలోనే ఉత్తమ ప్రతిభ కనపరిచిన కరీంనగర్ జిల్లాకు ఢిల్లీ సదస్సులో ప్రశంస లభించింది. స్వచ్ఛభారత్ మిషన్ రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఐఐపీఈ, తాగునీటి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 32 జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. జిల్లానుంచి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్  నీతూప్రసాద్, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్ హాజరయ్యారు.

ఇతర జిల్లాలతో పోల్చితే సత్వర ఫలితాలు సాధించిన కరీంనగర్ జిల్లాకు సదస్సులో ప్రశంసలు లభించాయి. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు మంచి ఫలితాలు సాధించాయని, త్వరలో మిగిలిన పది నియోజకవర్గాల్లోనూ పూర్తిస్థాయి మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతామని చైర్‌పర్సన్ తుల ఉమ వివరించారు. స్వచ్ఛభారత్ అమలులో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ కృషిని తెలియచేశారు.

మరిన్ని వార్తలు