బతుకంతావేదనే!

28 Mar, 2014 02:36 IST|Sakshi

నిజామాబాద్ అర్బన్/సుభాష్‌నగర్:  ‘‘మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి సాధించినపుడే రాష్ట్ర ప్రగతి సుగమం అవుతుంది. అందుకే అల్లాహ్ సాక్షి గా మైనార్టీల సమగ్రాభివృద్ధికి మా ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మా  ప్రభుత్వంలో మైనార్టీలకు అవకాశం లేదని, రాలేదని నిరుత్సాహపడకూడదు. రంజాన్ బోధించిన చిత్తశుద్ధితోనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు అందించాం’’ అన్నారు నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. దురదృష్టవశాత్తూ ఆయన మరణం అనంతరం వచ్చిన పాలకులు ముస్లింల సంక్షేమాన్ని విస్మరించారు.

 వైఎస్ కంటే ముందు చంద్రబాబు హయాంలో ఎదుర్కొన్న కష్టాలే మళ్లీ పునరావృత్తమయ్యాయి. వై ఎస్ మైనార్టీ విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు వృత్తిపరమైన శిక్షణ కూడ అందించి ఉద్యోగావకాశాలు కల్పిం చారు. మైనార్టీ సంక్షేమ బడ్జెట్‌ను నాలుగింతలు చేశారు. ముస్లింల కుటుంబాలు ఆనందంతో కళకళలాడాలనే సామూహిక వివాహాల నిమిత్తం రూ. 5 కోట్ల నిధిని మంజూరు చేశారు. పెళ్లి చేసుకున్న ప్రతి జంటకు వస్తువులు, తదితర అవరసరాల కోసం తక్షణమే  రూ.15 వేలు ఖర్చు చేశారు. సచార్ కమిటీ సిఫార్సుల అమలుకు కషి చేసిన నేత ఆయనే.

 టీడీపీలో గడ్డు పరిస్థితి
 తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు మైనార్టీల అభ్యున్నతిని నిర్లక్ష్యం చేశారు. అరకొర నిధులు విడుదల చేస్తూ వచ్చారు. దీంతో మైనార్టీల అభివృద్ధి పడకేసింది. వారు అనేక ఇబ్బందులతో జావనం కొనసాగించారు. షాదీఖానాల నిర్మాణానికి నామమాత్రపు నిధులు కేటాయించారు. మైనార్టీ యువత ఉన్నత విద్యను అభ్యనభ్యసించే వీలు లేకుండా పోయింది. దీంతో వారు కార్మికులుగానే మిగిలిపోయారు. ఆనాడు పెద్ద చదువులు చదివినవారు మైనార్టీలలో అతి తక్కువగానే ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

 రాజన్న రాకతో వరాల వెల్లువ
 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో అల్పసంఖ్యాక వర్గాల జనాభా 3,59,193. ఇందులో ముస్లింలు 3,38,824 మంది. వీరు వైఎస్ రా జశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇబ్బందులు లేకుండా జీవించగలిగారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు, ఉచిత సామూహిక వివాహాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణ వితరణ తదితర పథకాలు అందాయి. అతి పేద మై నార్టీలకు ఆరోగ్యశ్రీ ఎంతో తోడ్పడింది. కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్యసేవలు అందాయి. 2009లో 8314 మంది విద్యార్థులకు 192.89 లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ అం దింది. ప్రస్తుతం జిల్లాలో 8,232 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో రీయింబర్స్‌మెంట్ ఐదున్నర కోట్లు, ఉపకార వేతనాలు రెండున్నర కోట్లు రావలసి ఉంది.

>
మరిన్ని వార్తలు