ఉపాధి పనులపై ‘జూపల్లి’ ఆరా!

28 May, 2016 02:59 IST|Sakshi
ఉపాధి పనులపై ‘జూపల్లి’ ఆరా!

శనిగరంలో కూలీలతో భేటీ
కోహెడ ఎంపీడీవో, టెక్నికల్ అసిస్టెంట్‌పై బదిలీ వేటు
ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్
మాదాపూర్‌లో ఇంకుడుగుంతల పరిశీలన

 
 
కోహెడ/బెజ్జంకి : జిల్లాలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరా తీశారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన ముందుగా కోహెడ మండలం శనిగరంలోని కోసగుట్ట వద్ద ఉపాధి పథకం కింద చేపట్టిన ఊటకుంటను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామంలో చేపట్టిన పనులు, కూలీల సమస్యలపై సమీక్షించారు. పనికి తగ్గ కూలి రావడంలేదని, డబ్బులు సకాలంలో అందడం లేదని కూలీలు కొమురవ్వ, రాజు తదితరులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రోజుకు ఆరు గంటలు పనిచేస్తున్నా.. కూలి రూ.65 నుంచి రూ.70కి మించి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కాస్తా డబ్బులైనా నెలరోజులు గడవందే చెల్లించడంలేదని పేర్కొన్నారు. గతేడాది ఏడుగురు కూలీలకు మాత్రమే వంద రోజుల పని కల్పించారని, మిగిలిన వారెవరికీ పనులు చూపలేదని వివరించారు.

గ్రామంలో 1300 కుటుంబాలు ఉం డడం.. 672 మందికి మాత్రమే జాబ్‌కార్డులు మంజూరుచేయడంపై డ్వామా పీడీ వైవీ.గణేశ్ ను మందలించారు. మండలంలో కరువు ఉ న్నా.. కూలీలకు పనులు ఎందుకు కల్పించలేద ని ప్రశ్నించారు. కూలీలకు వేతనాల చెల్లింపులో నిర్లక్ష్యం, పనులు గుర్తించడంలో క్షేత్రస్థారుులో అలసత్వం ప్రదర్శించినట్లు గుర్తించి ఎంపీడీవో చెట్టి శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్‌ను బదిలీ చేయూలని పీడీని ఆదేశించారు. అలాగే కూలీలకు పని కల్పించని కారణంగా ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేశంను సస్పెండ్‌కు ఆదేశించారు.


 మాదాపూర్‌లో మొక్కల పరిశీలన
 బెజ్జంకి మండలం మాదాపూర్‌కు వెళ్లిన మంత్రి జూపల్లి.. అక్కడ ఉపాధి పథకం కింద పెంచుతున్న మామిడిమొక్కలను పరిశీలించారు. ఇం కుడుగుంతల ప్రగతిపై ఆరా తీశారు. నీటి సౌకర్యం లేక మొక్కలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. మామిడితోటకు నీరు పెట్టేందుకు బోరు మం జూరు చేరుుంచాలని అదే గ్రామానికి చెందిన రైతులు కుమ్మరి సుగుణ, నర్సయ్య కోరారు.   మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పథకాలతోనే కడుపు నిండదని, రైతులకు పంట పండితేనే అందరి కడుపులూ నిండుతాయని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో ఒడిదుడుకులు ఉన్నాయని, ప్రత్యామ్నా య మార్గాలు అన్వేషించి..వాటిని అధిగమిం చాలని సూచిం చారు. కరువును ఎదుర్కొనేందుకు సీఎం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని, ఇందులోభాగంగానే జిల్లాలో విరివిగా ప్రాజెకు ్టలు నిర్మిం చేందుకు సిద్ధపడుతున్నారని పేర్కొన్నారు.


 మాదాపూర్‌కు నిధులు
 మాదాపూర్‌లో సాధించిన ప్రగతిని సర్పంచ్ రవీందర్‌రెడ్డి మంత్రికి వివరించారు. గ్రామం లో 100 శాతం ఇంకుడుగుంతలు, మరుగుదొ డ్లు, ఇంటిపన్ను వసూలు, అక్షరాస్యత సాధించామని, మరిన్ని నిధులు మంజూరు చేస్తే మరింత ముందుకెళ్తామని వివరించారు. స్పందించిన మంత్రులు సీసీ రోడ్ల నిర్మాణాల కు రూ.30లక్షలు, వీవో భవన నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేశారు. గ్రామంలో రూ.40 లక్షల పనులు చేస్తే అదనంగా మరో రూ.16 లక్షల పనులకు మంజూరు ఇస్తామన్నా రు.

కార్యక్రమాల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్మ న్ రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మె ల్యే వొడితెల సతీశ్‌కుమార్, జెడ్పీచైర్‌పర్సన్ తుల, జెడ్పీ వైస్ చైర్మన్ రారుురెడ్డి రాజిరెడ్డి, జెడ్పీటీసీలు పొన్నాల లక్ష్మణ్, తన్నీరు శరత్‌రావు, ఎంపీపీ ఒగ్గు దామోదర్, ఉప్పుల స్వా మి, తహసీల్దార్లు ఎస్‌కె.ఆరిఫా, ఈశ్వరయ్య, సర్పంచులు గాజే శ్రీధర్, మాడుగుల రవీందర్‌రెడ్డి, కోహెడ పీఏసీఎస్ చైర్మన్ కర్ర శ్రీహరి, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు